రూపాయల్లో పెంచి పైసల్లో తగ్గించారు.. ఇదెక్కడి న్యాయం!

Wednesday, May 30th, 2018, 08:39:32 AM IST

గత కొన్ని రోజులుగా దేశంలో ఎప్పుడు లేని విధంగా పెట్రోలు ధరలు పెంచి సామాన్యుడిని ఉక్కిరి బిక్కిరి చేసిన ధరలు ఎట్టకేలకు కొంత తగ్గాయి. ఢిల్లీ ముంబై కోల్ కతా చెన్నై వంటి ప్రముఖ నగరాల్లో వాహనదారులు పెట్రోలు అంటే భయపడే పరిస్థితికి వచ్చింది. డీజిల్ – పెట్రోలు ధరల భారం భరించలేక కొందరైతే వాహనాలను బయటకు తీయలేదు. మరికొంత మంది చిరు వ్యాపారాలు వాహనాలను అమ్మేసి అదే డబ్బుతో గుర్రాలను కొనుగోలు చేశారు. ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో విమర్శలు వచ్చాయి.

16 రోజులపాటు ఇబ్బందికి గురి చేసిన పెట్రోలు ధరలు ఇప్పుడు తగ్గాయి. అయితే రుపాయల్లో పెంచి పైసల్లో తగ్గించడం ఏమిటని చాలా మంది గుర్ర్రుగా ఉన్నారు. ఢిల్లీలో 60 పైసలు తగ్గించగా పెట్రోలు ధర రూ.77.83 కు చేరుకుంది. ఇక ముంబైలో 59 పైసలు తగ్గించగా ముంబైలో రూ.85.65. కోల్ కతా లో రూ.80.47 – చెన్నైలో రూ.80.80 ధరలు కలిగి ఉన్నాయి. ఒక్కసారిగా రూపాయల్లో పెంచి ఇప్పుడు మాత్రం 50 పైసలు తగ్గించడం ఎంతవరకు న్యాయం అని చాలా విమర్శలు వస్తున్నాయి.

  •  
  •  
  •  
  •  

Comments