బిగ్ బాస్ 12 : అయ్యో శ్రీశాంత్ కి ఎందుకంత తక్కువ చెల్లిస్తున్నారు

Friday, October 5th, 2018, 03:13:44 AM IST


బాలీవుడ్ లో టెలివిజన్ షో లలో బిగ్ బాస్ ప్రస్తుతం చాలా ఆసక్తి కరం గా సాగుతోంది. ఎంతలా అంటే మొత్తంగా పదకొండు సీజన్లు పూర్తి చేసి పన్నెండవ సీజన్ కూడా విజయ వంతంగా ముందుకు సాగుతోంది. మరియు ఈ షో కి బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్ ఖాన్ హోస్టుగా వ్యవహరిస్తున్నాడు. ఐతే తాజాగా క్రికెటర్ శ్రీశాంత్‌ రెమ్మ్యూనరేషన్ విషయం చర్చనీయాంశం గా మారింది. ఇక వివరాల్లోకి వెళితే బిగ్ బాస్ హౌస్ లో ఉన్న అందరి కంటెస్టెంట్ ల కంటే శ్రీశాంత్ రెమ్మ్యూనరేషన్ చాల తక్కువనే వార్తలు సోషల్ మీడియాలో హల్చల్ చేస్తున్నాయి. ఐతే ప్రస్తుతం బిగ్ బాస్ హోస్ గేమ్ షో ఆడుతున్న కంటెస్టెంట్ లేనటువంటి దీపిక కక్కర్‌కు వారానికి రూ.15 లక్షలు, కరణ్‌వీర్ బోహ్రా, నేహా పెండ్సేలకు వారానికి రూ.20 లక్షలు మరియు అనూప్ జలోటాకు వారానికి రూ.45 లక్షలు చెల్లిస్తున్నారు. కానీ పాపం శ్రీశాంత్ కి మాత్రం వారానికి 5.లక్షలు మాత్రమే చెల్లిస్తున్నట్లు సోషల్ మీడియా లో వార్తలు పుట్టుకొస్తున్నాయి. ఐతే ఈ వార్తల్లో ఎంతవరకూ నిజం ఉందనేది ఇంకా తెలియరాలేదు . ఐతే మరో పక్క పాపం శ్రీశాంత్‌ అభిమానులు మాత్రం ఎందుకంత తక్కువ రెమ్మ్యూనరేషన్ చెల్లిస్తున్నారని నెట్టింట్లో ట్రోల్స్ చేస్తున్నారు. మరి కొంతమంది ఐతే అసలు బిగ్ బాస్ 12 లో శ్రీశాంత్ లోని ఏ అంశాన్ని పరిగణి లోకి తీసుకొని అంత
తక్కువ రెమ్యునరేషన్ చెల్లిస్తున్నారని బిగ్ బాస్ ని ప్రశ్నిస్తున్నారు….