స్టేషన్ ఘన్‌పూర్ లో భారీ మెజార్టీ తో గెలుస్తా.!…: తెరాస ఎమ్మెల్యే

Tuesday, October 2nd, 2018, 11:21:24 PM IST

తెలంగాణ రాష్ట్రం లోని తెరాస ప్రభుత్వం ఇప్పటికే తమ పార్టీ తరుపున పోటి చేసే 105 మంది సిట్టింగ్ ఎమ్మెల్యే ల జాబితా విడుదల చేసిన సంగతి తెలిసిందే… ఐతే ఇందులో చాలా కాలంగా పార్టీ కి సేవ చేస్తున్న వారికి ఎమ్మెల్యే టికెట్టు ని కేటాయించక పోవడంతో కొంతమంది పార్టీ మారిన సంగతి కూడా తెలిసిందే. ఐతే ఇదే కాకుండా ఇప్పుడున్న పార్టీ అభ్యర్థుల్లో కొంతమంది మధ్యన విబేధాలు తలెత్తడం తో స్వయం గా కెసిఆర్ గారే రంగం లోకి దిగాల్సి వచ్చింది. ఐతే ఇందులో భాగం గా తాటికొండ రాజయ్య మరియు కడియం శ్రీహరి ల మధ్య విబేధాలు ఎక్కువగా ప్రబలడం తో ఇద్దరినీ పిలిచి సీరియస్ వార్నిగ్ ఇచ్చినట్లు తెలుస్తోంది.. అంతే గాక తమ వైఖిరి కనుక మార్చుకోక పోతే చర్యలు తప్పవని హెచ్చరించారని తాటికొండ రాజయ్య చెప్తున్నారు.

ఐతే ఈ వివాదం పై కేటీఆర్ గారే స్వయం గా చొరవ తీసుకొని మాట్లాడారని, పార్టీ కోసం కష్టపడి పని చేస్తానని , అంతేగాక గతం లో నావల్ల ఏదైనా తప్పులు జరిగింటే వాటిని సరిదిద్దుకుంటానని కేటీర్ తో చెప్పానని అన్నారు … ఐతే కేటీర్ గారు కూడా పార్టీ కోసం కష్టపడి పనిచేసే ప్రతి ఒక్కరిని గౌరవిస్తామని , మరియు వారికి కూడా రాబోయే రోజుల్లో తప్పకూండా అవకాశం ఉంటుందని నిరాశ చెందవద్దని హామీ ఇచ్చారని రాజయ్య అన్నారు. అంతేగాక మొదట్లో ప్రకటించిన సిట్టింగ్ ఎమ్మెల్యే ల జాభితా లో తన పేరు కూడా ఉందని , అది కెసిఆర్ గారి నిర్ణయమని అని , తాను ఎవరికీ భయపడవలసిన అవసరం లేదని, అది తుది నిర్ణయమని మార్చడానికి వీలు కాదని అని అన్నారు. అంతే గాక ఈ సారి స్టేషన్ ఘనపూర్ లో భారీ మెజార్టీ తో గెలుస్తానని ధీమా వ్యక్తం చేస్తున్నట్లు ఒక పత్రికా సమావేశం లో తలిపారు .