లేటెస్ట్ న్యూస్ : పవన్, జగన్, బిజెపి నేతలకు చంద్రబాబు హెచ్చరికలు

Tuesday, March 20th, 2018, 06:11:01 PM IST

ఆంధ్ర ప్రదేశ్ కు ప్రత్యేక హోదా ఇవ్వడం పై ఇన్నాళ్లు చంద్రబాబు నాయుడు జాప్యం చేశారని, పోనీ ప్రత్యేక హోదా బదులు కేంద్రం ఇస్తానన్న ప్రత్యేక ప్యాకెజీ ద్వారా అయినా చంద్రబాబు కేంద్ర ప్రభుత్వం నుండి సక్రమంగా నిధులు రాబట్టారా అంటే అదికూడా లేదని, జనసేన అధినేత పవన్ అన్న విషయం తెలిసిందే. అయినా ప్రత్యేక హోదా వల్లనే ఏపీ అభివృద్ధి జరుగుతుందని ఆయన అన్నారు కూడా. ఓ వైపు బిజెపి నేతలు కూడా మొదట హోదా బదులు ప్యాకెజీ ఇస్తే చాలు అని ఒప్పుకుని, ఇప్పుడు మళ్లి హోదా కావలనడం ఎంత వరకు న్యాయమని, దీనివెనుక టీడీపీ కుట్ర దాగివుందని వారు విమర్శించారు.

అలానే మరోవైపు వైసిపి అధినేత జగన్ కూడా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రత్యేక ప్యాకెజీ పేరుతో కేంద్రానికి అమ్ముడుపోయి హోదా నినాదాన్ని తొక్కిపట్టారని అన్నారు. నాలుగేళ్లపాటు నిద్రపోయిన బాబుకి ఇప్పుడు ఎన్నికలు దగ్గరకు వచ్చేసరికి హోదా గుర్తుకు వచ్చిందా అని ఆయన ఎద్దేవా చేశారు. అయితే వీరి విమర్శలపై చంద్రబాబు నేడు తనదైన రీతిలో స్పందించారు. జగన్, పవన్, బీజేపీ నేతలు తనపై లేనిపోని అసత్య ఆరోపణలు చేస్తున్నారని, నా మనోభావాలు దెబ్బతీస్తే మీరే ఇబ్బంది పడతారని వారిని బాబు హెచ్చరించారు. మంగళవారం మీడియాతో మాట్లాడిన చంద్రబాబు, పోలవరం ప్రాజెక్టు 5 కోట్ల ప్రజల ఆకాంక్ష అని చెప్పారు.

పోలవరంలో చేతులు పెడితే కాలిపోతాయని హెచ్చరించారు. 2019కి ప్రాజెక్టును పూర్తి చేయాలన్నారు. రూ.33 వేల కోట్ల ఆర్ ఆండ్ ఆర్ ప్యాకేజీకి డబ్బులు రాష్ట్రం భరిస్తుందని కొందరు అంటున్నారని, తాను అలా ఎప్పుడూ చెప్పలేదని సీఎం స్పష్టం చేశారు. కొంతమందికి కలలు వస్తున్నాయని, ఆ కలలు చెడు కలలు కాకూడదని ఆకాంక్షించారు. ఏపీ ఇప్పటికే తీవ్రంగా నష్టపోయిందని, సహకరిస్తారనుకున్న మిత్రపక్షం కూడా మోసం చేసిందన్నారు. తాము ఓవైపు ఏపీ హక్కుల కోసం పోరాడుతుంటే, తమపై యుద్ధం చేస్తున్నామంటారా అని విపక్ష నేతలపై సీఎం ఫైర్ అయ్యారు. విభజన చట్టంలో హామీలు అమలు చేయాల్సిందేనని చంద్రబాబు తెగేసి చెప్పారు. ప్రజలు అందరికంటే తెలివిగలవారని, వాళ్ళు అన్ని గమనిస్తూనే ఉంటారని, ఎవరివల్ల కాదని ఆయన అన్నారు….

  •  
  •  
  •  
  •  

Comments