నేను అలా చెప్పలేదు అంటున్న : జెడి లక్ష్మి నారాయణ

Sunday, April 1st, 2018, 03:35:43 PM IST

సీబీఐ మాజీ జాయింట్ డైరెక్టర్, అలానే ప్రస్తుతం మహారాష్ట్ర అదనపు డిజి గా పనిచేస్తున్న లక్ష్మి నారాయణ కొద్దీ రోజుల క్రితం తన ఉద్యోగానికి రాజీనామా ఇచ్చిన విషయం తెలిసిందే అయితే తన మీద ఎటువంటి ఒత్తిడులు లేవని, అది కేవలం తన వ్యక్తిగతంగా స్వచ్ఛందంగా తీసుకున్న నిర్ణయం అని చెప్పారు. తను మహారాష్ట్రలో పని చేస్తున్నందున ఇక్కడ చేస్తున్న, చేయబోయే కార్యక్రమాలకు ఇబ్బందిగా ఉంటోందని పదవీవిరమణకు నిర్ణయం తీసుకున్నట్లు వివరించారు.

అయితే ఆయన రాజీనామా చేసింది రాజకీయాల్లో చేరటానికి అనే ప్రచారం కొంత జరిగింది .అలానే ఆయన పవన్ కళ్యాణ్ నేతృత్వంలోని జనసేన పార్టీ లో చేరుతారని పలు మీడియా సంస్థలు వార్తలు ప్రసారం చేశాయి. అయితే నిన్న ఆయన కుటుంబ సమేతంగా తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. ఉద్యోగ విరమణకు ప్రభుత్వ అనుమతి రాగానే తానేమి చేయదలచుకున్నానో వివరంగా తెలియజేస్తానని చెప్పారు. అయితే రాజకీయాల్లోకి ప్రవేశిస్తానని నేను చెప్పలేదుగా, మీరే ఏదో పార్టీలో చేరుతున్నారని ప్రసారం చేస్తున్నారు అంటూ మీడియానుద్దేశించి వ్యాఖ్యానించారు….