బరోసా ఇచ్చిన ప్రభుత్వం..వెనక్కి తగ్గిన అగ్రిగోల్డ్ బాధితులు!

Thursday, May 31st, 2018, 03:54:20 PM IST

గత కొంత కాలంగా ఆంధ్రప్రదేశ్ లో అగ్రి గోల్డ్ బాధితులు నిరంతరాయంగా ఆందోళనలు చేపడుతున్న సంగతి తెలిసిందే. అయితే మొత్తానికి ఏపి ప్రభుత్వం అగ్రిగోల్డ్ బాధిత సంఘంతో మాట్లాడి మ్యాటర్ ను ఓ కొలిక్కి తీసుకువచ్చింది. ముందుండి ఈ సమస్యపై మంత్రి ఆనందబాబు చర్చలు జరిపి బాధితులకు అండగా ఉంటామని తెలిపారు. గత కొన్ని నెలలుగా జరుగుతున్న ఈ దీక్షకి ఇక ఎట్టకేలకు ఎండ్ కార్డు వేశారు. అగ్రగోల్డ్ బాధితులను ఆత్మఘోష పాదయాత్ర పేరుతో శుక్రవారం చలో సచివాలయం కార్యక్రమానికి పిలుపునివ్వగా ఇప్పుడు ఆందోళనను విరమిస్తున్నట్లు అగ్రిగోల్డ్ బాధితుల సంక్షేమ సంఘం ప్రకటించింది.

దీంతో గత రెండు రోజులుగా కొనసాగుతున్న ఉత్కంఠకు తెరపడింది. ఇక ఇప్పటికే బాధితుల కోసం రెండు కోట్ల వరకు తాత్కాలికంగా ప్రభుత్వం అందించిందని, ఎవరిని మోసం చేయకుండా టీడీపీ ప్రభుత్వం ముందుకు సాగుతోంది అన్నారు. ఇక ఈ విషయంపై జనసేన అథినేత పవన్ కళ్యాణ్ అలాగే వైఎస్సార్ సిపి అధ్యక్షుడు రాజకీయ లబ్ది కోసమే స్పందిస్తున్నట్లు మంత్రి ఆనందరావు తెలిపారు. తప్పకుండా బాధితులను ఆదుకుంటామని ఇప్పటికే మృతుల కుటుంబాలకు పరిహారం ఇంకా అగ్రిగోల్డ్ బాధితుల వివరాల సేకరణ వంటి కార్యక్రమాలకు ప్రభుత్వం నుంచి పూర్తి సహకారం అందుతోందని మంత్రి ఆనందరావు తెలియజేశారు.