అంబానీ పెళ్లి వేడుకలు మొదలయ్యేది అప్పుడే!

Monday, March 26th, 2018, 12:33:39 PM IST

ఇండియాలో పరిచయం లేని పేరు ఏదైనా ఉందా అని అంటే అంబానీ అనే చెబుతారు. ఆర్థిక లావా దేవిలా గురించి ఏదైనా చర్చించుకుంటే అంబానీల పేర్లు రాకుండా ఉండవు. ఎలాంటి బిజినెస్ లో అయినా రాణించగల ఆ ఫ్యామిలిలో ఏదైనా చిన్న పార్టీ జరిగిందంటే అందరి చూపు వారిపైనే ఉంటుంది. ఇక పెళ్లి వేడుక జరిగితే ఎలా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ప్రపంచం చెప్పుకునే విధంగా పెళ్లి జరుగుతుందని అంచనా వేయవచ్చు. ఇటీవల ముకేశ్ అంబానీ పెద్ద కుమారుడు ఆకాశ్‌ అంబానీ పెళ్లి కోసం కుటుంబ సభ్యులు ఒక నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తోంది.

ప్రముఖ వజ్రాల వ్యాపారి రస్సెల్‌ మెహతా చిన్న కుమార్తె శ్లోక మెహతాతో ఆకాష్ వివాహాన్ని ఫిక్స్ చేశారు. గోవాలో ఇరు కుటుంబాలు బంధువులకు స్నేహితులకు పరిచయ విందును ఏర్పాటు చేసింది. ఆకాష్ శ్లోక కు చిన్నప్పటి నుంచి మంచి పరిచయం ఉంది. పైగా ఇరుకుటుంబాలు కూడా చాలా కాలంగా సన్నిహితంగా ఉంటున్నారు. ఇక డిసెంబర్ లో వీర్ పెళ్లి ఘనంగా జరపడానికి డిసైడ్ అయినట్లు సమాచారం. డిసెంబర్ 8 నుంచి 12వరకు పెళ్లి వేడుకలు ముంబయిలోని ఒబెరాయ్‌లో జరగనున్నాయని తెలుస్తోంది. ప్రస్తుతం శ్లోక ‘రోజీ బ్లూ ఫౌండేషన్‌’ డైరక్టరుగా ఉన్నారు.