123: జగన్ – పవన్ – చంద్రబాబు?

Monday, April 2nd, 2018, 09:58:06 AM IST

2014 ఎలక్షన్స్ లో అంతకు ముందు అందరు అనుకున్నదే జరిగింది. రాష్ట్ర విభజనతో కాంగ్రెస్ అనుకున్న ప్లాన్ మొత్తం రివర్స్ అయ్యింది. ఓటర్లు ఒక్కసారిగా వారి ఓటు పవర్ ని చాలా డిఫెరెంట్ గా చూపించారు. అనుభవం గల నాయకులకే పట్టం కట్టడంతో సరికొత్త రాజకీయాలు మొదలయ్యాయి. అయితే వచ్చే ఎలక్షన్స్ లో తెలంగాణాలో తెరాస వస్తుందని అందరు ఓ అంచనాకు వచ్చారు. కానీ ఆంధ్రప్రదేశ్ లో మాత్రం చాలా డిఫెరెంట్ రాజకీయాలు మొదలవ్వబోతున్నాయని చెబుతున్నారు. ప్రస్తుత పరిస్థితులను చూస్తుంటే ఎవరు అధికారంలోకి వస్తారో చెప్పలేమని చాలా మంది సీనియర్ నాయకులు చెప్పడం హాట్ టాపిక్ అయ్యింది.

అయితే ప్రస్తుతం 123 అంశం రాష్ట్ర రాజకీయ విశ్లేషకుల్లో ప్రధాన అంశంగా మారింది. మొదటి స్థానంలో ఎవరు వస్తారు అనేది 2019 ఎలక్షన్స్ వరకు సస్పెన్స్. కానీ రెండవ స్థానంలో మాత్రం పవన్ కళ్యాణ్ జనసేన ఉంటుందని ప్రతి ఒక్కరు చెబుతున్నారు. పవన్ టార్గెట్ కూడా అదే. వెంటనే సీఎం అయిపోవాలని అతను ఏమి ఆశపడటం లేదని ప్రతిపక్ష హోదాలో అయినా లేకుంటే అసెంబ్లీలో ప్రశ్నించే వ్యక్తిగా అయినా నిలబడాలని ప్రయత్నం చేస్తున్నాడని సీనియర్ రాజకీయ నాయకులు చెబుతున్నారు. పవన్ కూడా చాలా ఇంటర్వ్యూలలో ఇదే విషయాన్నీ తెలిపాడు.

ఇక 123 విషయానికి వస్తే.. ప్రస్తుతం చంద్రబాబు టీడీపీ పరిస్థితి అయితే అస్సలు బాలేదని టాక్. ప్రత్యేక హోదా విషయంలో మాటా మార్చిన బాబు నిర్ణయాన్ని ఓటర్లు ఎలా స్వీకరిస్తారో వేచి చూడక తప్పదు. ఆయనకు కాలం కలిసి రాకుంటే మూడవ స్థానానికి పడిపోతారు. ఇక జగన్ వైఎస్సార్ సీపీ పార్టీ ఇంతవరకు యాత్రలతోనే సరిపెట్టుకుంది. ఒక వైపు నుంచి ఆలోచిస్తే.. జగన్ జనాలకు దగ్గరవవ్వడం చాలా మంచి ప్లస్ పాయింట్. ఇక మరో విధంగా ఆలోచిస్తే.. అసెబ్లీలో ప్రశ్నించడం మానేసి ప్రతి సారి చంద్రబాబు పై విమర్శలు చేయడం ఎంతవరకు కరెక్ట్.

సీఎం అయితే గాని జగన్మోహన్ అసెంబ్లీకి రాలేరా? అని జనాలు ఆలోచిస్తే ఆయన స్థానం ఈ సారి నెంబర్ 3 కి పడిపోతుంది. లేదా మళ్లీ ప్రతి పక్షంలోనే ఉండాలి. మొత్తంగా ఆలోచిస్తే మొదటి స్థానం ఎవరిదీ అనేది 2019 ఎలక్షన్స్ వరకు ఎవ్వరు చెప్పలేరు. ఊహాగానాలే తప్ప 123 అంశం ఆ దేవుడికే తెలియాలి. కానీ బలంగా వినిపిస్తోన్న ఒక్క నిజం ఏమిటంటే. సమయం అనుకూలిస్తే.. ప్రజలు డబ్బుకు ఆశపడకుండా ఓటు హక్కును వినియోగించుకుంటే పవన్ సీఎం అయ్యే అవకాశాలు ఉన్నాయి. మరి భరత దేశ రాజకీయ చరిత్రలో అది జరిగే పనేనా..?

  •  
  •  
  •  
  •  

Comments