ఫైనల్ గా నిమ్మరసం తాగించిన బాబు!

Sunday, July 1st, 2018, 02:20:07 AM IST

తెలుగు దేశం పార్టీ సీనియర్ నేత రాజ్యసభ సభ్యుడు సీఎం రమేష్ గత కొంత కాలంగా కడప ఉక్కు ప్లాంట్ కోసం ఆమరణ దీక్ష చేపట్టిన సంగతి తెలిసిందే. అలాగే బీటెక్ రవి కూడా దీక్ష చేప్పట్టిన సంగతి తెలిసిందే. రోజు రోజుకి వారి ఆరోగ్యం క్షీణిస్తుండడంతో వైద్యులు హెచ్చరికలు జారీ చేశారు. అయితే ఈ రోజు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వారి దీక్షను విరమింప చేశారు. రమేష్ రవిలకు నిమ్మరసం తగ్గించి శాలువాలని కప్పి అభినందించారు.

అనంతరం చంద్రబాబు వారిద్దరి గురించి మాట్లాడారు.. ఈ దీక్ష మొత్తం దేశ దృష్టిని ఆకర్షించింది. మీ దీక్ష వృధాగా పోదు. కడప ఉక్కు ఫ్యాక్టరి వచ్చిందనే విష్యం చరిత్రలో చీర స్థాయిగా నిలుస్తుందని అన్నారు. అదే విధంగా ఈ పోరాటం ఇంతటితో ఆగదని అందరం ఏకమై ప్లాంట్ ను సాధించే వరకు పోరాటం సాగిస్తామని చంద్రబాబు తెలియజేశారు. అలాగే ప్రతిపక్షాలు కేంద్రాన్ని ప్రశ్నించకుండా రాజకీయ లబ్ది కోసం తమపై విమర్శలు చేస్తున్నారని చెప్పారు.