కొండగట్టు ప్రమాదం: డీజిల్ కక్కుర్తి.. గతంలోనే లారీ ప్రమాదం!

Tuesday, September 11th, 2018, 05:56:25 PM IST

ఓ యాత్ర జగిత్యాలలో తీవ్ర విషాదాన్ని నింపింది. మరికొద్ది సేపట్లో ఇంటికి చేరుకుంటామన్నా వారందరూ కనిపించని లోకాలకు వెళ్లిపోయారు. ఈ విధంగా తలచుకొని మరణించిన వారి కుటుంబ సభ్యులు కనీరుమున్నీరవుతున్నారు. కొండగట్టు దారులపై డ్రైవర్ కు సరిగ్గా అవగాహనా లేకపోవడం కొత్తగా ఆ రోజే రావడం కూడా ఘటనకు మరో కారణం. మొత్తంగా ఈ ప్రమాదంలో 50 మందికి పైగా మృతి చెందినట్లు తెలుస్తోంది.

మరో ఏడుగురి పరిస్థితి విషమంగా ఉండడంతో హైదరాబాద్ కి తరలించారు. ఇక మృతుల్లో మహిళలు చిన్నారులే ఎక్కువగా ఉండటం మరింత బాధాకరమని స్థానికులు తెలిపారు. అదే విధంగా ఈ ప్రమాదానికి ప్రధాన కారణం ఆర్టీసి అధికారులు, ప్రభుత్వమే అని చెబుతున్నారు. గతంలో లారీ ప్రమాదం కూడా ఇదే చోట జరగడం వలన 20 మందికి పైగా మరణించారు. అప్పుడు భారీ వాహనాలను ఘాట్ రోడ్డుపై నిషేదించారు. బైక్స్‌ను మాత్రమే అనుమతించేవారు.
అందుకు సంబందించిన హెచ్చరిక బోర్డులను ఉంచారు.

పెద్ద వాహనాలకు ప్రత్యామ్నయంగా బైపాస్‌ రోడ్డు కూడా ఉంది. అయితే మళ్లీ ఆర్టీసీ బస్సులు, ప్రయివేట్‌ వాహనాలు ఘాట్ రోడ్డుపైనే నడుస్తున్నాయి. గత మూడు నెలల నుంచి మళ్లీ అనుమతిస్తున్నట్లు తెలుస్తోంది. హైవేపైకి వెళ్లాలి అంటే మరో 5 కిలో మీటర్లు ఎక్కువగా ప్రయాణించాల్సి వస్తుందని అదే ఘాట్ రోడ్డుపై నుంచి అయితే 1 కిలో మీటర్ తరువాతే వస్తుందని డీజిల్ కు కక్కుర్తి పడి ఈ షార్ట్ కట్ ను ఉపయోగిస్తున్నరట. ఘాట్‌ రోడ్డు నిర్మాణం ఆర్‌అండ్‌బీ సైతం నిబంధనలకు విరుద్దంగా ఉన్నట్లు అధికారులు గతంలోనే ప్రభుత్వానికి నివేదిక పంపారు. ఇరువైపులా గోడ నిర్మించాలని నిర్ణయించినప్పటికీ దానికి పునాది పడలేదు. ఇరువైపులా గోడ ఉండి ఉంటే ఇంతటి ప్రమాదం జరిగి ఉండేది కాదని స్థానికులు చెబుతున్నారు.

  •  
  •  
  •  
  •  

Comments