ప్రముఖ దర్శకుడు మణిరత్నంకు గుండెపోటు!

Thursday, July 26th, 2018, 04:54:19 PM IST

సౌత్ ప్రముఖ సినీ దర్శకుడు మణిరత్నంకు హఠాత్తుగా గుండెపోటు రావడంతో అందరూ ఒక్కసారిగా షాక్ అయ్యారు. ఈ రోజు మధ్యాహ్న సమయంలో చెస్ట్ లో నొప్పి ఎక్కువవడంతో కుటుంబ సభ్యులు వెంటనే హాస్పటల్ కి తరలించారు. అయితే ప్రస్తుతం ఆయన ఆరోగ్యం నిలకడగా ఉన్నట్లు వైద్యులు తెలుపడంతో కుటుంబ సభ్యులు ఊపిరి పీల్చుకున్నారు. పలువురు తమిళ సినీ ప్రముఖులు మణిరత్నం సన్నిహితులకు ఫోన్ చేసి ఆరోగ్యం గురించి అడిగి తెలుసుకున్నారు. బొంబాయి రోజా నాయకుడు అలాగే గీతాంజలి వంటి చిత్రాలని అందించిన మణిరత్నం మంచి దర్శకుడిగా గుర్తింపు తెచ్చుకున్నారు. అయితే ప్రస్తుతం ఆయన తమిళ్ లో చెక్క ఛీవంత వానం అనే మల్టీస్టారర్ స సినిమా చేస్తున్నారు. శింబు అరవింద స్వామి విజయ్ సేతుపతి వంటి వారు నటిస్తున్న ఆ సినిమా తెలుగులో సుల్తాన్ గా రిలీజ్ కానుంది.

  •  
  •  
  •  
  •  

Comments