నగరానికి వస్తున్న పరిపూర్ణానంద.. ఘనస్వాగత పలకనున్న బీజేపీ!

Tuesday, September 4th, 2018, 12:19:16 PM IST

హిందువులు దేవుడిలా కొలిచే రాముడిపై కత్తి మహేష్ వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. ఆ మాటలకూ వ్యతిరేఖంగా ప్రశాంతంగా పాదయాత్ర చేస్తానని చెప్పిన శ్రీపీఠం పీఠాధిపతి పరిపూర్ణానంద ను కూడా కత్తి మహేష్ తో పాటు నగరబహిష్కరణకు గురి చేసిన సంగతి కూడా తెలిసిందే. అయితే కోర్టులో పోరాడి ఊరట పొందిన పరిపూర్ణానంద నేడు హైదరాబాద్ కు బయలుదేరారు. గత రాత్రి కాకినాడ నుంచి హైదరాబాద్ కు బయలుదేరారు.

ఇక మార్గం మధ్యలో ఆయన విజయవాడలోనికి కనకదుర్గమ్మనము దర్శించుకున్నారు. ఇక భారత జనతా పార్టీ పరిపూర్ణానందకు ఘానా స్వాగతం పలికేందుకు హైదరాబాద్ లో పలు ఏర్పాట్లు చేస్తోంది. అయితే విజయవాడకు ముందే వెళ్లిన ఉప్పల్ బీజేపీ ఎమ్మెల్యే ఎన్వీఎస్ ప్రభాకర్ పరిపూర్ణానందను తీసుకొని వస్తున్నారు. మధ్యాహ్న సమయానికి హైదరాబాద్ కు చేరుకునే అవకాశం ఉంది. బీజేపీ తో పాటు వీహెచ్పీ నేతలు కూడా శివార్ల నుంచి భారీ ఊరేగింపుతో ఘన స్వాగతం పలికేందుకు సిద్ధమవుతున్నారు. ఇక విజయవాడలో మీడియాతో మాట్లాడిన పరిపూర్ణానంద హిందూ ధర్మం కోసం తాను ఎంత దూరమైన వెళతానని తెలియజేశారు.

  •  
  •  
  •  
  •  

Comments