ముందు నీ స్థాయి తెలుసుకో.. కళ్యాణ్ దిలీప్ తో మాట్లాడిన పవన్!

Monday, April 2nd, 2018, 08:31:33 AM IST


పవన్ అభిమానిగా గత కొంత కాలంగా మీడియా సమావేశాల్లో జనసేనకు మద్దతుగా ఉన్న దిలీప్ సుంకర సడన్ గా జనసేన పై నిప్పుల చెలరేగిన సంగతి తెలిసిందే. పార్టీలో కొంత మంది తనని అవమనిస్తున్నారని అలాగే పీఆర్ఓ లు డిబేట్స్ కి పిలవకూడదని మీడియాకు చెబుతున్నారు అని అందుకే పార్టీకి గుడ్ బై అని చెప్పడంతో అభిమానులు ఒక్కసారిగా షాక్ అయ్యారు. అలాగే పవన్ అభిమానిగా కూడా ఉండదని దిలీప్ సుంకర చెప్పాడం రాష్ట్ర వ్యాప్తంగా హాట్ టాపిక్ అయ్యింది.

దీంతో విషయం పెద్దది కాకముందే పవన్ దిలీప్ తో చర్చలు జరిపాడు. ఈ విషయాన్ని స్వయంగా దిలీప్ తన సోషల్ మీడియా ఎకౌంట్ ద్వారా తెలిపారు. ‘అధినేత ను కలవలడం జరిగింది.. సుదీర్ఘమైన సమయం కేటాయించారు.. ఇదో అద్భుతమైన అనుభూతి.. 41 రోజులు మెడిటేషన్ తో పాటు కొన్ని సూచనలు ఆయన చేశారు.. సోషల్ మీడియా ఈ మండలం రోజులు పూర్తిగా తీసేస్తున్నా.. అని ట్వీట్ చేశారు. అంతే కాకుండా మరో ముఖ్యమైన విషయాన్ని కూడా పవన్ తెలిపినట్లు పేర్కొన్నారు. దిలీప్ స్థాయిని గుర్తు చేస్తూ..”వ్యవస్థ తో పోరాడే శక్తి కలవాడివి..నీ స్థాయి ఏంటో తెలియని వ్యక్తులతో ఎంత కాలం పోరాడతావ్?” సోషల్ మీడియా విమర్శలకు స్పందించడం మనెయ్యిగలిగే నియంత్రణ సాధించు. నన్ను ఎంతో మంది ఎన్నో అంటారు.. వాటిన్నటికి స్పందిస్తే గమ్యం చేరుకోగలనా? పార్టీ ఆఫీస్ లో ఇద్దరు ప్రముఖల సమక్షంలో ఈ వ్యాఖ్యలు చేసినట్లు దిలీప్ తెలిపారు.

  •  
  •  
  •  
  •  

Comments