పెట్రోలు ధరలు తగ్గేలా లేవు.. హైదరాబాద్ లో ఎంతంటే?

Friday, September 14th, 2018, 10:42:59 AM IST

ఏం చేసినా కూడా పెట్రోలు ధరలు తగ్గేలా లేవు. కాంగ్రెస్ ఆధ్వర్యంలో గత వారం జరిగిన భారత్ బంద్ పూర్తిగా వ్యర్ధమే అన్నట్టు తెలుస్తోంది. ఆ బంద్ ప్రభావం ఏమి కనిపించడం లేదు. చమురు సంస్థలు ఏ మాత్రం ఆలోచించకుండా ఇష్టానుసారంగా రోజుకో తీరుగా ధరలను పెంచేస్తున్నాయి. శుక్రవారం నాడు కూడా పెట్రోలు డీజిల్ ధరలు మళ్లీ పెరిగాయి. లీటరు డీజిల్ పై 22 పైసల వరకు ధరను పెంచగా పెట్రోలుపై మరో 28 పైసలు అదనంగా పెంచేశారు.

ఇక పలు రాష్ట్రాల్లో పెట్రోల్ ధరలు ఊహించని ధరకు అందుకున్నాయి. దేశ రాజధాని ఢిల్లీలో పెట్రోలు ధర లీటరుకు రూ. 81గా ఉండగా, డీజిల్‌ ధర రూ.73.30కి చేరుకుంది. ఇక హైదరాబాద్‌ లో అయితే పెట్రోలు ధర రూ. 85.88 చేరగా కోల్ కతాలో పెట్రోలు ధర లీటరుకు రూ. 82.87కు పెరిగింది దేశ ఆర్థిక రాజధాని ముంబైలో డీజిల్ ధర రూ. 77.82కు, పెట్రోలు ధర రూ. 88.67కు పెరిగింది. పెరిగిన పెట్రోల్ ధరల దృష్ట్యా చాలా కొన్ని నగరాల్లో ప్రజలు వాహనాల వాడకాన్ని తగ్గించినట్లు తెలుస్తోంది.

  •  
  •  
  •  
  •  

Comments