అనుకున్నట్టుగానే స్మిత్ తప్పుకున్నాడు !

Monday, March 26th, 2018, 06:24:55 PM IST

ఐపీఎల్ 11వ సీజన్ కోసం ప్రస్తుతం క్రికెట్ అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ముఖ్యంగా రాజస్థాన్ – చెన్నై జట్లు రీ ఎంట్రీ ఇస్తుండడంతో మరింత ఆసక్తి నెలకొంది. అయితే గేమ్ స్టార్ట్ అవ్వకముందే రాజస్థాన్ కి గట్టి దెబ్బ తగిలింది. ఆ జట్టు కెప్టెన్ గా సెలెక్ట్ అయిన ఆస్ట్రేలియా కెప్టెన్ స్టీవెన్ స్మిత్ తన బాధ్యతల నుంచి తప్పుకోనున్నట్లు చెప్పేశాడు. బాల్ టాంపరింగ్‌ వివాదంలో చిక్కుకున్న స్మిత్ పై ముందుగానే ఐపీఎల్ యాజమాన్యం చర్యలు తీసుకునే అవకాశం ఉందని చెప్పింది. ఐసిసి వివరణ తరువాత మాట్లాడతామని చెప్పారు. అయితే ఆ అవకాశం వారికి ఇవ్వకుండానే స్మిత్ కెప్టెన్ గా ఉండడం లేదని చెప్పేశాడు. ఇక రాజస్థాన్ రాయల్స్ జట్టు యాజమాన్యం ఇండియన్ ప్లేయర్ అజింక్య రహానేను కెప్టెన్ గా నియమించింది. రహానే మొదటి నుంచి ఆ జట్టులో కొనసాగుతోన్న సంగతి తెలిసిందే. ఏప్రిల్ 7న ఐపీఎల్ మొదటి మ్యాచ్ జరగనుంది. రాజస్థాన్ మాత్రం తన మొదటి మ్యాచ్ ను హైదరాబాద్ లో సన్ రైజర్స్ తో ఏప్రిల్ 9న తలపడనుంది.