ముందస్తు ఎన్నికలు ముందుగానే వచ్చేలా ఉన్నాయ్?

Sunday, September 9th, 2018, 09:29:07 AM IST

టీఆరెస్ పార్టీ తీసుకున్న నిర్ణయం ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల్లోని కాకుండా దేశమంతా చర్చనీయాంశంగా మారింది. అసెంబ్లీ రద్దు చేసి సరికొత్తగా ముందస్తు ఎన్నికలకు సిద్ధమవ్వడం ఎలాంటి ఫలితాన్ని ఇస్తుందో అని ప్రతి ఒక్కరు చర్చించుకుంటున్నారు. అయితే కేసీఆర్ ఇటీవల మీడియా సమావేశంలో ఎన్నికలు వచ్చే రెండు నెలల్లోనే జరుగుతాయని చెప్పడం ప్రతిపక్షాలకు ఊహించని షాక్ ఇచ్చింది.

ఇక ఎలక్షన్ కమిషన్ కి కూడా ఈ ఎన్నికలు సవాల్ గా మారాయి. వీలైనంత త్వరగా ఏర్పాట్లు చేయడమనేది చాలా ఇబ్బందులతో కూడుకున్న పని. కొన్ని రోజులుగా వస్తున్న కథనాల ప్రకారం నవంబర్ లో లేదా డిసెంబర్ లో ఎన్నికల తతంగా ముగుస్తుందని అంతా అనుకున్నారు. ఇకపోతే ప్రస్తుతం వినిపిస్తోన్న టాక్ ప్రకారం ఈసీ అందరూ ఊహించిన దానికంటే ఒక నెల ముందే ఎలక్షన్స్ వస్తాయని తెలుస్తోంది. అక్టోబర్ 10 తరువాత ఎన్నికల షెడ్యూల్ రిలీజ్ చేసే అవకాశం ఉందట. అంటే నవంబర్ ఆరంభంలోనే పోలింగ్ కూడా స్టార్ట్ అవుతుంది. అందుకు సంబంధించిన ప్రయత్నాలను ఎలక్షన్స్ కమిషన్ ముమ్మరం చేస్తోందని సమాచారం. మరికొన్ని రోజుల్లో రాష్ట్రానికి ఓటింగ్ యంత్రాలు రానున్నాయట. ఇక ఓటర్ల విషయానికి వస్తే ప్రస్తుతం తెలంగాణలో 2.61 కోట్ల మంది ఓటర్లు ఉన్నారు. కొత్తగా చేరితే ఆ సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉంది.

  •  
  •  
  •  
  •  

Comments