పంచాయ‌తీ ఎన్నికలకు సిద్ధమవ్వండి..త్వరలోనే రిజ‌ర్వేష‌న్ పై ప్రకటన!

Friday, May 25th, 2018, 12:30:41 AM IST

ఎన్ని ఎన్నికలు వచ్చినా కూడా గ్రామాల్లో పంచాయితీ ఎన్నికలు వస్తేఒక్కసారిగా గ్రామాల్లో వాతావరణం మారిపోతుంది. ఇక తెలంగాణాలోని గ్రామాల్లో మరికొన్ని రోజుల్లో అదే వాతావరణం కనిపించనుంది. ఎన్నికల ప్రచారాలు ఏర్పట్లు అన్ని సిద్దమవ్వడానికి ఎంతో కాలం లేదు. వచ్చే నెల జూన్ 10నాటికీ పంచాయితీ ఎన్నికల రిజర్వేషన్ ప్రక్రియను పూర్తి చేసేందుకు తెలంగాణ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ముందుగా బీసీ ఓటర్ల గణన పూర్తయ్యాక సర్పంచ్ వార్డు స్థానాలకు సంబందించిన రిజర్వేషన్ ప్రక్రియను ప్రకటించాలని డిసైడ్ అయినట్లు తెలుస్తోంది.

రీసేంట్ గా తెలంగాణ శాఖ మంత్రి జూపల్లి కృష్ణా రావు అధికారులతో ప్రత్యేక సమావేశాన్నీ నిర్వహించి పనుల గురించి చర్చించారు. ఈ మీటింగ్ లో తెలంగాణ గ్రామీణాభివృద్ధి సంస్థ ముఖ్య ముఖ్య కార్య‌ద‌ర్శి వికాస్ రాజ్‌ తో పాటు క‌మిష‌న‌ర్ నీతూ ప్ర‌సాద్‌ ఇతర మండల స్థాయి అధికారులు పాల్గొన్నారు. పంచాయ‌తీ ఎన్నిక‌ల నిర్వ‌హ‌ణ‌పై తీసుకోవాల్సిన జాగ్రత్తలు అలాగే ఏర్పాట్ల గురించి చర్చించారు. అదే విధంగా హ‌రిత‌హారం, ఎల్ఈడీ వీధి దీపాల గురించి కూడా జూపల్లి అధికారులతో మాట్లాడి ఏ మాత్రం ఆలస్యం చేయకుండా పనులను పూర్తి చెయ్యాలని దిశా నిర్దేశం చేశారు.

  •  
  •  
  •  
  •  

Comments