ఎలక్షన్స్ వస్తున్నాయి..జాగ్రత్త: కేసీఆర్ – రాహుల్

Saturday, March 3rd, 2018, 09:32:12 AM IST

ఎన్నికల సమయం దగ్గరపడుతోంది అంటే చాలు రాజకీయనాయకుల్లో ఆందోళన ఏ స్థాయిలో ఉంటుందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ముఖ్యంగా అధికార హోదాలో ఉన్న నాయకులు ఒక్కసారిగా అలెర్ట్ అయిపోతారు. ప్రస్తుతం తెలంగాణాలో ఉన్న అన్ని పార్టీలు కూడా రహస్య మీటింగ్ లతో చాలా చర్చలు సాగిస్తున్నాయి. వచ్చే ఏడాది ఎలాగైనా అధికారంలోకి రావాలని జనాలను ఆకర్శించే పనిలో పడ్డాయి. అన్ని అనుకున్నట్టు జరిగితే ఈ ఏడాది చివరిలోగానే పార్లమెంట్ ఎలక్షన్స్ జరగవచ్చని కేంద్ర నుంచి సమాచారం అందించిన సంగతి తెలిసిందే.

ఈ విషయం పై మన తెలుగు రాష్ట్ర పార్టీలు ఇటీవల ప్రత్యేక సమావేశాలను ఏర్పాటు చేసినట్టు తెలుస్తోంది. కాంగ్రెస్ హై కమాండ్ నుంచి రాహుల్ గాంధీ తెలంగాణ కాంగ్రెస్ నేతలకు ఆహ్వానాన్ని పంపారట. అందరు ఒకసారి ఢిల్లీలో జరిగే సమావేశాలకు హాజరుకావాలని తెలపడంతో తెలంగాణ కాంగ్రెస్ నేతలతో పాటు ఏపి నేతలు కూడా వెళ్లనున్నారని సమాచారం. 2018-19 బెడ్జెట్ ప్రవేశపెట్టిన కేంద్రంపై ఇప్పుడు కొన్ని నెగిటివ్ కామెంట్స్ వస్తున్నాయి. ఆ మైనస్ ను కాంగ్రెస్ ప్లస్ చేసుకోవాలని చూస్తోంది.ఇక సర్వేల ప్రకారం దాదాపు అన్ని స్థానాల్లో టీఆరెస్ పార్టీ చాలా బలంగా ఉందని కేసీఆర్ నాయకులతో చెబుతున్నారు. తప్పకుండా నెక్స్ట్ ఎలక్షన్స్ లో కూడా మనమే గెలవగలమని భరోసా ఇచ్చారు. అయితే మరికొన్ని మరి కొన్ని జిల్లాల్లో మాత్రం పార్టీ బలపడాలని నేతలతో కేసీఆర్ చర్చించినట్లు సమాచారం.