లిక్కర్ కింగ్ మాల్యా ఇండియాకి వచ్చేస్తాడట!

Wednesday, July 25th, 2018, 09:55:40 AM IST

భారతదేశ బ్యాంకులను నిండా ముంచేసి విదేశాలకు ఎగిరిపోయిన కింగ్ ఫిషర్ యజమాని విజయ్ మాల్యా త్వరలోనే ఇండియాకి రానున్నట్లు తెలుస్తోంది. ఈడీ అధికారుల నుంచి అందిన సమాచారం ప్రకారం మాల్యా తన అప్పులను కట్టడానికి కూడా ప్రయత్నాలు చేస్తున్నాడట. తన ఆస్తులను అమ్మెందుకు ఇప్పటికే కొన్ని ప్రణాళికలు సిద్ధం చేసుకున్నట్లు టాక్. గతంలో బ్రిటిష్ ప్రభుత్వంతో మంతనాలు జరిపిన ప్రభుత్వ అధికారులు మాల్యాను అరెస్ట్ చేయడానికి ఎంతగానో ప్రయత్నం చేశారు. అయితే అవేవి ఫలితానివ్వలేదు.

అయితే భారత్ కు స్వచ్ఛందంగా తిరిగివస్తానని ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్(ఈడీ) అధికారులను మాల్యా ఆశ్రయంచాడట. కానీ అధికారుల నుంచి ఎలాంటి హామీ లభించలేదని తెలుస్తోంది. మాల్యా ఎయిర్ పోర్ట్ లో విమానం నుంచి బయటకు అడుగు పెట్టగానే అధికారులు అరెస్ట్ చేసే అవకాశం ఉన్నట్లు ఒక ఈడీ అధికారు తెలియజేశారు. అయితే రెండు మూడు రోజుల్లో బెయిల్ ద్వారా మాల్యా మళ్లీ బయటకు వచ్చేస్తాడని కూడా తెలుస్తోంది. ఇక మాల్యాపై బ్రిటన్ కోర్టులో దాఖలైన కేసులపై తీర్పు త్వరలోనే రాబోతుందని విశ్వసనీయ వర్గాలు తెలిపాయి. 2010లో 17 భారతీయ బ్యాంకుల నుంచి రూ.10,000 కోట్ల రుణాలను తీసుకున్న మాల్యా ఆ మొత్తాన్ని చెల్లించకుండా 2016లో బ్రిటన్ కు పారిపోయాడు. ఈ విషయం అందరికి తెలిసిందే.

  •  
  •  
  •  
  •  

Comments