విజయ్ మాల్యాకు బ్యాడ్ టైమ్ స్టార్ట్ అయ్యింది!

Wednesday, May 9th, 2018, 09:06:25 AM IST

వేలకోట్లు అప్పు చేసి విదేశాలకు పారిపోయిన లిక్కర్ కింగ్ విజయ్ మాల్యాకు బ్యాడ్ టైమ్ స్టార్ట్ అయినట్టే కనిపిస్తోంది. భారత బ్యాంకుల వద్ద అప్పు చేసి వాటిని నిండా ముంచిన తరువాత చేతులెత్తసిన తీరుకు అతన్నీ శిక్షించాలని దేశ నలువైపులా అనేక ఆరోపణలు వచ్చాయి. కావాలనే మాల్యా బ్యాంకులకు రావాల్సినడబ్బును ఎగ్గొట్టాడని న్యాయ స్థానాలకు ఎన్నో కేసులు అందాయి. ఇక రీసెంట్ గా లండన్ లో కోర్టు కూడా అతనికి వ్యతిరేఖంగా తీర్పును ఇచ్చింది.

ఐడీబీఐ బ్యాంక్ తో సహా మొత్తంగా భారత బ్యాంకులకు ఎగ్గొట్టిన సొమ్ము కారణంగా రూ.10,385 కోట్ల (155 కోట్ల డాలర్లు)ను చెల్లించాల్సిందేనని గతేడాది డెట్ రికవరీ ట్రిబ్యునల్ (డీఆర్‌టీ) తీర్పు చెప్పగా లండన్ న్యాయస్థానం కూడా ఆ తీర్పును అమలు చెయ్యాలని చెప్పింది. దీంతో మాల్యా తలపట్టుకున్నాడు. అప్పీలుకు కూడా నీరాకారన ఎదురవ్వడంతో మాల్యా డబ్బు డబ్బు తిరిగి కట్టాల్సిన పరిస్థితి దగ్గరపడింది. ఇదిలా ఉండగా ఢిల్లీ చీఫ్ మెట్రోపాలిటన్ కోర్టులోనూ విజయ్ మాల్యాకు ఊహించని షాక్ తగిలింది. మాల్యా నుంచి రావాల్సిన డబ్బును వసూలు చేసేందుకు గాను అతని ఆస్తులను జప్తు చేయాల్సిందిగా చీఫ్‌ మెట్రోపాలిటన్‌ మేజిస్ట్రేట్‌ విదేశీ మారక ద్రవ్య నియంత్రణ చట్టం (ఫెరా) కింద విచారించి ఆదేశించారు.

  •  
  •  
  •  
  •  

Comments