లేటెస్ట్ న్యూస్ : గెలిచేది ఎవరో ఎగ్జిట్ పోల్ బయట పెట్టేస్తుందా…?

Saturday, May 18th, 2019, 02:30:21 AM IST

మరికొద్ది గంటల్లో ఏపీలో ఎగ్జిట్ పోల్ ఫలితాలు వెలువడనున్నాయి… కాగా ఈసారి అధికారం ఎవరిదో తెలుసుకోడానికి ఈ ఎగ్జిట్ పోల్ ఫలితాలు దాదాపు విజేతలని ఖరారు చేయనున్నాయి… కాగా ఎన్నికలు పూర్తయినప్పటినుండి ఎవరి విజయం మీద వారు ధీమాగా ఉన్నారు. కాగా ఇప్పుడు వెలువడనున్న ఫలితాలు నిశ్శబ్ద విప్లవంగా మారనున్నాయి. కానీ ఇపుడు ఏపీలో అందరు కూడా ఈ నిశ్శబ్ద విప్లవాన్ని నమ్ముకున్నారని తెలుస్తుంది. అధికార ప్రతిపక్ష పార్టీలు అన్ని కూడా నిశ్శబ్ద విప్లవాన్ని, దాని ఫలితాలపై ఎంతో ఆశ పెట్టుకొని ఉన్నాయని సమాచారం.

అయితే సైలెంట్ వేవ్ అనబడే విప్లవం ఎవరి వైపు ఉందో చెప్పడానికి మరికొద్ది గంటల సమయం మాత్రమే ఉంది. కాగా ఈ ఎగ్టిట్ పోల్ సర్వే అసలు గుట్టు బయటేస్తుంది. ఎవ్వరు ఎటు నుండి ఎటు వైపు వెళ్లారు అనేది కూడా బయటపెట్టనుంది. కానీ ఈసారి ఏపీలో ఎన్నకలు అన్ని కూడా చాలా కట్టుదిట్టంగా, పోటాపోటీ జరిగాయి… కానీ వీటిని కూడా కొన్ని పార్టీల నాయకులు తప్పుబడుతున్నారు. పోలింగ్ అంత కూడా ఒక్క పార్టీ పక్షానికి మాత్రమే జరిగిందని, పోలింగ్ సమయంలో చాలా అవకతవకలు జరిగాయని ఆరోపణలు చేస్తున్నారు.

అయితే ఏపీలో మల్లి టీడీపీ పాలన రావాలని ప్రజలు ఎంతో ఆశగా రాత్రి వరకు కూడా వేచి ఉండి మరీ ఓటు వేశారని టీడీపీ వర్గాలు అంటున్నాయి.. అంతేకాకుండా టీడీపీ పాలనతో విసిగిపోయిన ప్రజలు వైసీపీ అధికారంలోకి రావాలని వేచిఉండి ఓటేశారని అంటున్నారు. అయితే జనసేన కూడా ఇలాగె చెప్పుకుంటుంది… కొత్త ప్రభుత్వ పాలనా వస్తేనే తమ బతుకులు మారతాయని ప్రజలు కోరుకుంటున్నారని జనసేన వర్గాలు చెబుతున్నాయి. అయితే ఒక్క రోజు ఆగితే అన్ని వివరాలు బయటపడతాయని అందరు అంటున్నారు.