లేటెస్ట్ : నిషేధం పై స్టీవ్ స్మిత్ సంచలన నిర్ణయం!

Wednesday, April 4th, 2018, 02:00:38 PM IST

ఇటీవల కెప్‌టౌన్‌లో దక్షిణాఫ్రికాతో జరిగిన మూడో టెస్టు సందర్భంగా బాల్‌ ట్యాంపరింగ్‌ చేయడంతో కెప్టెన్‌ స్టీవ్‌ స్మిత్‌తోపాటు వైస్‌ కెప్టెన్‌ డేవిడ్‌ వార్నర్‌, కామెరాన్‌ బెన్‌క్రాఫ్ట్‌ పై క్రికెట్ ఆస్ట్రేలియా నిషేధం విధించిన సంగతి తెలిసిందే. ‘కెప్టెన్‌గా ఈ వివాదంలో పూర్తి బాధ్యత తీసుకుంటానని ఇంతకుముందే చెప్పాను. ఆ మాటకు కట్టుబాడి ఉన్నాను. నేను ఇంకా చెప్పాల్సింది ఏమీ లేదు. నాపై విధించిన ఆంక్షలను సవాల్‌ చేయడం లేదు. అయితే ఈ వివాదంలో ఏడాది నిషేధం ఎదుర్కొంటున్న ఆస్ట్రేలియా జట్టు మాజీ కెప్టెన్‌ స్టీవ్‌ స్మిత్‌ ఒక సంచలన నిర్ణయం తీసుకున్నారు.

తనపై క్రికెట్‌ ఆస్ట్రేలియా విధించిన శిక్షను సవాలు చేయబోనని ఆయన ప్రకటించారు. నిషేధం పై తన తప్పును ఒప్పుకుంటాను, అలానే ఎదుర్కొంటానని ఆయన తెలిపారు. గట్టి సందేశం ఇచ్చే ఉద్దేశంతో క్రికెట్‌ ఆస్ట్రేలియా ఈ చర్యలు తీసుకుంది, వాటిని నేను ఆమోదిస్తున్నాను’ అని స్మిత్‌ బుధవారం ట్వీట్‌ చేశారు. ఈ నిషేధం నేపథ్యంలో స్మిత్‌, వార్నర్‌ ఐపీఎల్‌ నుంచి కూడా ఏడాదిపాటు వైదొలగనున్నారు. స్మిత్‌ రాజస్థాన్‌ రాయల్స్‌ జట్టుకు ఈ సారి కెప్టెన్సీ నిర్వహించాల్సి ఉంది. 2016లో వార్నర్‌ నాయకత్వంలో హైదరాబాద్‌ సన్‌రైజర్స్‌ జట్టు గత ఐపీఎల్‌ టోర్నీని గెలుచుకున్న విషయం తెలిసిందే…..