జనసేనకు షాకిచ్చిన్న సర్వే.. బాబు కూడా డౌటే – నెక్స్ట్ సీఎం?

Saturday, September 15th, 2018, 02:30:56 PM IST

2019 ఎలక్షన్స్ కోసం ప్రస్తుతం దేశమంతటా ఎదురుచూస్తోంది. ఆంధ్రప్రదేశ్ లో ఎలాంటి రాజకీయ పరిస్థితులు నెలకొంటాయో ఊహించడం కష్టంగానే అనిపిస్తోంది. చంద్రబాబు వర్సెస్ జగన్ అని ప్రతి ఒక్కరు చెబుతున్నారు. ఇక పవన్ మద్దతుదారులు జనసేనదే పై చేయి అంటున్నారు. అందరికి నమ్మకంగానే ఉన్నప్పటికీ సీఎం పీఠంపై అప్పుడే సర్వేలు మొదలయ్యాయి. రీసెంట్ గా ఇండియా టుడే-యాక్సిస్ మై ఇండియా నిర్వహించిన సర్వేలో ఏపీ ప్రజల మద్దతు ఎవరికో ఎక్కువగా ఉందొ తెలిసింది.

ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ కే ముఖ్యమంత్రి పట్టం కట్టనున్నట్లు సర్వేలో తేలింది. ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబుతో పోల్చుకుంటే జగన్ కె ఎక్కువ ప్రజాధారణ ఉందని పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్ కు నెక్స్ట్ సీఎం ఎవరని అడగ్గా.. 48 శాతం మంది వైఎస్ జగన్ కు మద్దతు ప్రకటించారు. ఇక చంద్రబాబుకు 38 శాతమే సపోర్ట్ చేసినట్లు తెలుస్తోంది. ఈ నెల 8 నుంచి 12 వరకూ రాష్ట్రవ్యాప్తంగా నిర్వహించిన సర్వేలో 10,650 మంది అభిప్రాయాలను సేకరించారు. ఇక ఎవరు ఊహించని విధంగా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కు 5 శాతం మంది ఓటేశారు. చంద్రబాబు ప్రభుత్వం పనితీరు బాగోలేదని 36 శాతం మంది ఓటేయగా పాలన బావుందని 33 శాతం మంది చెప్పారు. మరి ఈ సర్వే ఎంతవరకు నిజమవుతుందో తెలియాలి అంటే వచ్చే ఎలక్షన్స్ వరకు వెయిట్ చేయాల్సిందే.

నేటి ఏపి స్పెషల్ : గత ఏపి ఎన్నికల్లో తృటిలో ఓడిపోయిన నేతలు.. ఓ నేత 12 ఓట్లతో పరాజయం!

  •  
  •  
  •  
  •  

Comments