జగన్ పై దాడి తర్వాత బాబు సర్వే – షాకింగ్ రిజల్ట్స్..!!

Monday, October 29th, 2018, 07:05:35 PM IST

టీడీపీ అధినేత, ఆంధ్రరాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకు సర్వేలు చేయించుకోవటం అలవాటే, తాజాగా జగన్ పై దాడి జరిగిన నేపథ్యం లో ఆయన మరోసారి సర్వే చేయించుకున్నట్టు వార్తలు వస్తున్నాయి. జగన్ పై దాడి తరువాత ప్రజల ఆలోచన ఎలా ఉందొ తెలుసుకోవడానికి ఆయన ఈ సర్వే చేయించారట.

ఏపీ లో కూడా కాంగ్రెస్ తో జత కట్టాలనే ఆలోచనలో ఉన్న బాబుకు ఈ సర్వే రిజల్ట్స్ పెద్ద షాక్ ఇచ్చాయంట. సర్వే వివరాల్లోకి వెళితే జగన్ పై దాడి తరువాత నెలకొన్న పరిస్థితుల దృష్ట్యా టీడీపీ రాబోయే ఎన్నికల్లో ఓటమి పాలవటమే కాకుండా, చాల తక్కువ సంఖ్యలో సీట్లు వస్తాయని వెల్లడైందట. దీంతో కాంగ్రెస్ తో చేతులు కలిపే విషయమై బాబు పునరాలోచనలో పడ్డట్టు తెలుస్తుంది.

అంతర్గత సర్వేలు చేయించుకోవటం చంద్రబాబుకి కొత్తేమి కాదు, తనకు కావాల్సిన విషయం గురించి ముందే లీకులు వదిలి తదనుగునంగా సర్వే చేయించుకోవటం ఆయనకే చెల్లింది. సర్వే తాలూకా రిజల్ట్ పాజిటివ్ గ ఉన్నట్టయితే వెంటనే అధికారిక ప్రకటన వదులుతారు, ఆలా లేని పక్షం లో ఆ సర్వే విషయం అక్కడితో పక్కన పెడతారు. కాంగ్రెస్ తో జతకట్టి, ప్రత్యేక హోదా ఇవ్వని కారణంగా బీజేపీ ని ఓడించాలంటూ ప్రజలకు పిలుపినిచ్చి తిరిగి అధికారంలోకి రావాలనుకున్నారు బాబు. అయితే ఏ పార్టీకి వ్యతిరేకంగా టీడీపీని ఆ మహానేత ఎన్టీఆర్ స్థాపించాడో అదే పార్టీ తో బాబు చేతులు కలపాలి అనుకోవటం జనాలకు నచ్చలేదు, ఆనాడు కాంగ్రెస్ రాష్ట్రాన్ని అడ్డగోలుగా విభజించిన తీరు ఇంకా మర్చిపోలేదు ప్రజలు. ఈ సర్వే ఫలితాలు చూసి ఖంగు తిన్న బాబు, కాంగ్రెస్ తో పొత్తు విషయం లో వెనక్కి తగ్గినట్టు కనిపిస్తుంది.

  •  
  •  
  •  
  •  

Comments