లేటెస్ట్ అప్ డేట్ : సైరా లో అల్లు అర్జున్ – నిజమేనా…?

Saturday, February 9th, 2019, 06:10:07 PM IST

మెగాస్టార్ చిరంజీవి తాజాగా నటిస్తున్న చిత్రం “సైరా”. తెల్లదొరలపై పోరాటం చేసిన సైరా నరసింహారెడ్డి జీవిత చరిత్ర ఆధారంగా ఈ సినిమా తెరకెక్కుతోంది. ప్రస్తుతానికి ఈ షూటింగ్ శరవేగంగా జరుగుతుంది. సురేందర్ రెడ్డి ఈ చిత్రానికి దర్శకత్వం వహించగా రామ్ చరణ్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాడు. ఈ చిత్రం లో చిరుకు జోడిగా నయనతార నటిస్తుంది. అంతేకాకుండా ఈ చిత్రంలో చాలా సీనియర్ నటులు మరియు, పెద్ద స్టార్ నటులు కూడా నటిస్తుండటం విశేషం. అమితాబ్ బచ్చన్, విజయ్ సేతుపతి, కిచ్చ సుదీప్ వంటి స్టార్స్ ఈ సినిమాలో నటిస్తుండటంతో, ఈ చిత్రానికి అంచనాలు బాగానే పెరిగిపోతున్నాయి.

అయితే ఈ చిత్రానికి సంబందించిన ఒక తాజా వార్త ఇపుడు వైరల్ గా మారింది… ఈ సినిమాలో చిరుతో పాటు మరో మెగా హీరో కూడాకనిపించనున్నారని తాజా సమాచారం. ఆ హీరో ఎవరో కాదు. మన స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్. అయితే ఈ విషయం మాత్రం ఇంకా అధికారికంగా ఎవరు ప్రకటించలేదు. కానీ అల్లు అర్జున్ తో ఇప్పటికే చిత్ర బృందం సంప్రదింపులు జరిపారంట. చిరుతో నటించే ఛాన్స్ వస్తే అల్లు అర్జున్ ఒప్పుకోకుండా ఉంటాడా చెప్పండి… ఎగిరి గంతేసి మరీ షూటింగ్ కి హాజరవుతారు.