సాహో అప్డేట్స్ : “సాహో”లో ఇంకా బాకీ ఉంది ఇదే అంట.!

Friday, March 15th, 2019, 08:25:35 PM IST

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా శ్రద్ధా కపూర్ హీరోయిన్ గా సుజీత్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న భారీ బడ్జెట్ చిత్రం “సాహో”.బాహుబలి రెండు సినిమాలు తర్వాత ప్రభాస్ ఎలాంటి సినిమా చేస్తాడో అని అనుకున్న అందరి అంచనాలకు తగ్గట్టు గానే భారీ ప్రాజెక్టును ఎంచుకున్నారు.ఈ సినిమా కూడా హాలీవుడ్ ప్రమాణాలకు ఏ మాత్రం తీసిపోకుండా పక్కా యాక్షన్ థ్రిల్లర్ గా అత్యున్నత ప్రమాణాలతో ఎక్కడా కూడా రాజీ పడకుండా సుజీత్ అత్యంత ప్రతిష్టాత్మకంగా తీర్చిదిద్దుతున్నారు.

నిజానికి గత ఏడాదే విడుదల కావాల్సిన సినిమా అనుకున్న దానికంటే భారీగా వస్తుండడంతో ఇప్పటి వరకు షూటింగ్ కొనసాగుతోంది.అయితే ఇప్పుడు అందుతున్న తాజా సమాచారం ప్రకారం ఈ సినిమా షూటింగ్ అంతా అయ్యిపోవచ్చిందట.ఇక ఈ సినిమాలో పాటల టాకీ భాగం మాత్రమే బాకీ ఉందని సినీ వర్గాలు అంటున్నాయి.ఇప్పటికే ఈ చిత్ర యూనిట్ విడుదల చేసిన రెండు మేకింగ్ వీడియోలు అంచనాలు అమాంతం పెంచేసాయి.మరి అలాంటిది ఇక అసలైన అప్డేట్స్ ఇవ్వడం మొదలు పెట్టి టీజర్,ట్రైలర్లు వదలడం మొదలుపెడితే ఆ ధాటి ఎలా ఉంటుందో ఆలోచించొచ్చు.మరి ఇవన్నీ జరగాలంటే ఇంకొన్ని రోజులు ఆగక తప్పదు.