నెక్స్ట్ ఐపీఎల్ భారత్ లో కాదట?

Friday, April 27th, 2018, 05:55:16 AM IST

ఐపీఎల్ మొదలనప్పటి నుంచి ప్రతి ఏడాది ఎదో ఒక కొత్త తరహా విధానం కనిపిస్తోంది. అన్నిటికంటే ముఖ్యంగా 2018 ఐపీఎల్ 11వ సీజన్ చాలా స్పెషల్ అని చెప్పాలి. చెన్నై – రాజస్థాన్ మళ్లీ రావడం అలాగే ఇతర జట్లలో భారీ మార్పులు చోటు చేసుకోవడం అభిమానులను ఎంతో ఆసక్తిని రేపింది. ప్రస్తుతం జట్లన్నీ మంచి ఆటతీరును కనబరుస్తున్నాయి. అయితే వచ్చే ఏడాది కూడా సరికొత్త ఐపీఎల్ ని చూసే అవకాశం ఉంది. 2019 ఐపీఎల్ ఇండియాలో జరగదని టాక్ వస్తోంది.

ఎందుకంటే వచ్చే ఏడాది భారత్‌లో సార్వత్రిక ఎన్నికలు జరగనున్న కారణంగా ఐపీఎల్‌ మ్యాచులు ఎక్కడ నిర్వహిస్తామన్న విషయంపై బీసీసీఐ ప్రస్తుతం చర్చలు జరుపుతోంది. వచ్చే ఏడాది మార్చి 29 నుంచి మే 19 వరకు ఐపీఎల్ మ్యాచ్ లు జరగనున్నాయి. కుదిరితే యూఏఈలో నిర్వహించే అవకాశం ఉన్నట్లు సమాచారం. అలాగే సౌత్ ఆఫ్రికా పేరును కూడా పరిశీలిస్తున్నారు. దీనిపై ఇంకా ఏ నిర్ణయం తీసుకోలేదు. ముందు ఎన్నికల షెడ్యూల్‌ ను ఆధారంగా చేసుకొని ఐపీఎల్‌లోని కొన్ని మ్యాచ్‌ల ను అక్కడ జరిపే విధంగా నిర్ణయం తీసుకోనున్నారు. 2009లో ఐపీఎల్ రెండవ సీజన్ ను సౌత్ ఆఫ్రికాలో నిర్వహించిన సంగతి తెలిసిందే.

  •  
  •  
  •  
  •  

Comments