కొనసాగుతున్న భారత్‌ బంద్‌!

Monday, September 10th, 2018, 10:09:47 AM IST

రోజు రోజుకి ఆకాశాన్ని తాకుతున్న పెట్రోల్‌, డీజిల్‌ ధరల పెంపు సామాన్యుడిని తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తున్న సంగతి తెలిసిందే. జనల నుంచి ఇప్పటికే తీవ్ర విమర్శలు వెలువడుతున్నాయి. అయితే అందుకు నిరసనగా ఈ రోజు దేశ వ్యాప్తంగా బంద్‌ కొనసాగుతోంది. కాంగ్రెస్ తో పాటు వామపక్షాలన్ని కూడా కేంద్ర ప్రభుత్వ నిర్ణయానికి వ్యతిరేఖంగా బంద్ లో పాల్గొంటున్నాయి. కాంగ్రెస్‌ పార్టీ జాతీయ అధ్యక్షుడు రాహుల్‌ గాంధీ దిల్లీలోని రాజ్ ఘాట్ నుంచి రామ్ లీలా స్టేడియం వరకు కవాతు నిర్వహించారు.

పెట్రెల్‌, డీజిల్‌ ధరల పెంపును నిరసిస్తూ దేశవ్యాప్తంగా కాంగ్రెస్ నేతలు బంద్ ను కొనసాగిస్తున్నారు. నేడు ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం మూడు గంటల వరకు బంద్ కొనసాగనుంది. పెట్రోల్‌, డీజిల్‌ ధరలను వెంటనే తగ్గించాలని వామపక్షాలు డిమాండ్‌ చేస్తున్నాయి. తెలుగు రాష్ట్రాల్లో కూడా పలు చోట్ల బంద్ కొనసాగుతోంది. జనసేన పార్టీ విజయవాడ బంద్ లో పాల్గొంది. ఇక పలు జిల్లాల్లో బస్ డిపోల ఎదుట కాంగ్రెస్ కార్యకర్తలు బైఠాయించారు. నల్గొండలో బస్సులో డిపోకు పరిమతమయ్యాయి. నిరసనల్లో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీసులు జాగ్రత్తలు తీసుకుంటున్నారు.

  •  
  •  
  •  
  •  

Comments