ప్రతి ఇంటికి 2000 రూపాయలట.. బాగానే ఖర్చు పెట్టారు!

Sunday, May 13th, 2018, 10:03:40 AM IST

ఎన్నికల్లో గెలవాలంటే ఎంతగా కష్టపడాలో అందరికి తెలిసే ఉంటుంది. 5 ఏళ్ల పాలనలో లోపాలు ఎన్ని ఉన్నా ఒక్క ఎన్నికల సమయంలో జనాల మైండ్ నీ డైవర్ట్ చేసి ఓటుకు నోటు ఫార్ములా వాడితే సెట్ అయిపోతుంది. ఒక్క ప్రచారాన్ని గట్టిగా నిర్వహించి ఇంటికో ప్యాకేజ్ ప్రకటిస్తే ఓట్లు అవే పడతాయి. ప్రస్తుత రోజుల్లో జనాలు అదే తరహాలో ఆలోచిస్తున్నారు. ఎలాంటి వారైనా సరే మందు డబ్బుకు లొంగుతారు అని చాలా గ్రామాల్లో రాజకీయ నాయకులూ అదే తరహాలో ఫాలో అవుతున్నారు. ఇటీవల కర్ణాటక ఎలక్షన్స్ లలో కూడా అదే రిపీట్ అయినట్లు తెలుస్తోంది.

మొత్తానికి ఎన్నికలు ప్రశాంతంగా ముగిశాయి. దాదాపు 70%వరకు ప్రజలు వారి ఓటు హక్కును వినియోగించుకున్నారు. ప్రచారాన్ని గట్టిగా నిర్వహించిన బీజేపీ – కాంగ్రెస్ – జేడీఎస్‌లు ఓటర్లకు అదిరిపోయే అఫర్ ప్రకటించారు. అభ్యర్థి సామర్ధ్యాన్ని బట్టి అక్కడ నియోజక వర్గంలో డబ్బులు పంచె విధానాన్ని అమలు చేశారు. ప్రతి ఓటరుకు దాదాపు 2000 రూపాయల చొప్పున ఫిక్స్ చేశారు. అదే విధంగా మందు బాటిళ్లు కూడా పంచారని అక్కడి ప్రజలే చెబుతున్నారు. మరికొన్ని స్థానాల్లో అభ్యర్థి బలం తక్కువగా 3 వేలు పంచడానికి కూడా వెనుకాడలేదని తెలుస్తోంది. ఇక సీఎం సిద్దరామయ్య నియోజక వర్గంలో ఆయనకు పోటీగా ఉన్న ప్రత్యర్థి పార్టీ ప్రతి ఇంటికి ఒక ప్యాకేజ్ సెట్ చేసినట్లు టాక్. 5000 వరకు ఇచ్చినట్లు గ్రామస్థులు తెలుపడం విశేషం. మరి ఈ ఎన్నికల్లో నాయకులు ఖర్చు పెట్టిన డబ్బుకు ప్రతిఫలం ఎంత వరకు దక్కుతుందో చూడాలి.

  •  
  •  
  •  
  •  

Comments