మహేష్ #25 లేటెస్ట్ అప్డేట్ ఏంటంటే?

Wednesday, May 30th, 2018, 08:38:40 PM IST

భరత్ అనే నేను సినిమాతో మంచి హిట్ అందుకున్న మహేష్ బాబు ఇక నెక్స్ట్ సినిమా కోసం సిద్దమవుతున్నాడు. వంశీ పైడిపల్లి దర్శకత్వంలో రానున్న ఆ ప్రాజెక్టు మహేష్ కెరీర్ లో 25వ చిత్రం. దీంతో సినిమాపై అంచనాలు పెరుగుతాయి అనడంలో ఎలాంటి సందేహం లేదు. సినిమా షూటింగ్ ఎక్కువగా విదేశాల్లోనే ఉంటుందట. ఇక లేటెస్ట్ గా అందిన సమాచారం ప్రకారం.. ఈ సినిమాలో అల్లరి నరేష్ మహేష్ బాబు స్నేహితుడిగా కనిపించనున్న సంగతి తెలిసిందే. అయితే అతని పాత్ర కు సంబందించిన న్యూస్ ఇప్పుడు వైరల్ గా మారింది.

అల్లరి నరేష్ ఒక పేద వాడిగా కనిపిస్తాడట. మహేష్ కు బెస్ట్ ఫ్రెండ్ గా కొనసాగుతూ లైఫ్ ను ఎంజాయ్ చేసే విధానం సినిమాలో హైలెట్ గా నిలుస్తుందని టాక్ వస్తోంది. మహేష్ అయితే కోటీశ్వరుడి లా కనిపిస్తాడట. మరి ఇది ఎంతవరకు నిజమో తెలియదు గాని నరేష్ మాత్రం మొత్తానికి ఈ సినిమాలో కొత్తగా కనిపిస్తాడని తెలుస్తోంది. ఇక రెగ్యులర్ షూటింగ్ ను జూన్ 10న మొదలు పెట్టె అవకాశం ఉన్నట్లు సమాచారం. దిల్ రాజు – సి.అశ్విని దత్ కలిసి ఈ సినిమాను సంయుక్తంగా నిర్మిస్తున్నారు. మహేష్ సరసన పూజ హెగ్డే హీరోయిన్ గా నటించనుంది.

  •  
  •  
  •  
  •  

Comments