అనుకున్నదే జరిగిందా.. మణికర్ణిక నుంచి క్రిష్ ఔట్?

Monday, September 3rd, 2018, 07:19:30 PM IST

మంచి సందేశాత్మక చిత్రాలను అందించడంతో పాటు చరిత్రను కూడా మంచి ఎమోషన్ తో తెరకెక్కించగల దర్శకుడు క్రిష్. టాలీవుడ్ లో ది బెస్ట్ దర్శకుల్లో ఆయన ఒకరని స్పెషల్ గా చెప్పనవసరం లేదు. గౌతమీపుత్ర శాతకర్ణి సినిమాతో తానేంటో నిరూపించుకున్న క్రిష్ మణికర్ణిక లాంటి బారి ప్రాజెక్టు తెరకెక్కించే అవకాశం దక్కించుకున్నాడు. ఝాన్సీ లక్ష్మి బయి బయోపిక్ గా వస్తున్న ఈ చిత్రంలో ఝాన్సీ రాణిగా బాలీవుడ్ నటి కంగనా నటిస్తున్న సంగతి తెలిసిందే.

అయితే మొదటి నుంచి సినిమా సాఫీగా సాగుతోందని అంతా అనుకున్నారు. కానీ కంగనా దూకుడు వల్ల దర్శకుడు క్రిష్ చివరలో సినిమా నుంచి తప్పుకున్నట్లు తెలుస్తోంది. మొన్నటి వరకు ఈ విషయంపై రూమర్స్ బాగానే వచ్చినప్పటికీ మణికర్ణిక చిత్ర యూనిట్ నుంచే అందిన సమాచారం ప్రకారం కంగనా కథ దర్శకత్వంలో మొదటి నుంచి జోక్యం చేసుకోవడం వల్ల క్రిష్ చిరాకుతో బయటకు వచ్చినట్లు తెలుస్తోంది. బాలీవుడ్ ప్రముఖ న్యూస్ ఛానెల్స్ ఈ విషయంపై ప్రత్యేక కథనాలను ప్రసారం చేయడంతో రూమర్ నిజమే అన్నట్టుగా అర్ధమవుతోంది. క్రిష్ ప్రస్తుతం ఎన్టీఆర్ బయోపిక్ తో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. ఇక మణికర్ణిక ప్రాజెక్టుకు ప్రస్తుతం కంగన దర్శకత్వం వహించి ఫినిషింగ్ టచ్ ఇస్తున్నట్లు సమాచారం.

  •  
  •  
  •  
  •  

Comments