కోట్లు పలుకుతున్న కబడ్డీ ప్లేయర్స్!

Thursday, May 31st, 2018, 12:46:41 PM IST

ఐపీఎల్ వచ్చిన తరువాత చాలా వరకు వివిధ స్పోర్ట్స్ విభాగాల్లో మార్పులు వచ్చాయి. ఇండియాలో క్రికెట్ కు ఆదరణ ఎక్కువగా ఉండడంతో మిగతా ఆటల గురించి పెద్దగా మాట్లాడుకునే వారు కాదు. కానీ ప్రో కబడ్డీ లీగ్ వచ్చి అంచనాలను పూర్తిగా ఆ ఆలోచనను తారుమారు చేసింది. మొదట్లో ఈ టోర్నీ పై కొన్ని అనుమానాలు వచ్చాయి. కబడ్డీ ఎవరు చూస్తారు అనేలా కామెంట్స్ వచ్చాయి. కానీ మొదటి సీజన్ లోనే పికెఎల్ మంచి ఆదరణను అందుకుంది. ఆ తరువాత అయిదు సీజన్లను కూడా మంచి ఆదరణ దక్కడంతో మరికొన్ని నెలల్లో స్టార్ట్ కాబోయే ప్రో కబడ్డీ లీగ్ పై అంచనాలు పెరిగాయి.

అందువల్లే ప్రముఖ ఆటగాళ్ల రేట్లు కూడా గట్టిగా పెరిగాయి. వేలంలో మొదటి సారి ఆటగాళ్లను కోటి రూపాయలు వెచ్చించి మరి ప్రాంఛైజీలు దక్కించుకున్నాయి. ఆరుగురు ఆటగాళ్ల కోసం కోటికి పైగా వెచ్చించడం ఇదే మొదటి సారి. అందులో ఎవరు ఊహించని విధంగా మోను గోయాత్ భారీ ధరకు అమ్ముడు పోయాడు. రూ.1.51 కోట్లు పెట్టి హరియాణా స్టీలర్స్‌ సొంతం చేసుకుంది. అదే విధంగా రాహుల్‌ చౌదరి కి కూడా ఈ సారి డిమాండ్ బాగా పెరిగింది. రైడర్ గా పికెఎల్ లో రికార్డులు సృష్టించిన రాహుల్ ను మళ్లీ తెలుగు టైటాన్స్ రూ.1.29 కోట్లకు దక్కించుకుంది. దీపక్‌ నివాస్‌ హుడా కూడా మంచి రేట్ కు అమ్ముడు పోయాడు. రూ.1.15 కోట్లు పెట్టి జైపూర్‌ టీమ్ ఈ ఆల్‌రౌండర్‌ ని కొనేసింది.

నితిన్‌ తోమర్‌ (రైడర్) – రూ.1.15 కోట్లు – పుణెరి పల్టాన్‌

రిషాంక్‌ దేవడిగ (రైడర్) – రూ.1.11 కోట్లు – యూపీ యోధా

ఫాజెల్‌ అత్రాచలి (డిఫెండర్) – రూ.1 కోటి జట్టు – యు ముంబా