ఆ నాలుగు రాష్ట్రాలతో పాటే తెలంగాణ ఎలక్షన్స్!

Tuesday, September 11th, 2018, 08:11:41 AM IST

తెలంగాణలో రాజకీయ వేడి ఏ రేంజ్ లో ఉందొ స్పెషల్ గా చెప్పనవసరం లేదు. ఊహించని విధంగా టిఆర్ఎస్ పార్టీ తీసుకున్న నిర్ణయం ఎలాంటి ప్రభావాన్ని చూపిస్తుందా అని ప్రతి ఒక్కరు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. కేసీఆర్ చెప్పిన విధానం అంతా కనురెప్ప పాటులో జరిగిపోయింది. అసెంబ్లీ రద్దవ్వడం ఎన్నికల అభ్యర్థులను ప్రకటించడం చక చక జరిగిపోయాయి. అయితే ఎన్నికలు నిర్వహించే ఎలక్షన్ కమిషన్ కి ఇప్పుడు అసలు పని పడింది.

అసలు ఎలక్షన్స్ ఎప్పుడు జరుగుతాయన్న విషయాన్ని ఎన్నికల సంఘం అధికారులు అంత త్వరగా ఒక నిర్ణయానికి రాలేకపోతున్నారు. ఎదో రాజకీయ నాయకుల ఊహాగానాలే తప్ప అధికారికంగా ఎలాంటి సమాచారం వెలువడటం లేదు. ఇక రీసెంట్ గా అందిన సమాచారం ప్రకారం మధ్యప్రదేశ్‌, రాజస్థాన్‌, మిజోరాం, ఛత్తీస్‌గఢ్‌ ఎన్నికలతోపాటే తెలంగాణ రాష్ట్ర ఎలక్షన్స్ ను కూడా ఒకేసారి ఫినిష్ చేస్తే బావుంటుందని ఈసీ ఫిక్సయినట్టు సమాచారం. ఇక టీఆరెస్ పార్టీ మొదటి విడతలో ప్రకటించిన 105 అభ్యర్థుల నియోజకవర్గాల్లో ఎన్నికల ప్రచారాలని నిర్వహించడానికి ప్రణాళికలను రచిస్తోంది. కాంగ్రెస్ పార్టీ కూడా త్వరలోనే అభ్యర్థుల లిస్టును ప్రకటించనుంది. ప్రస్తుతం ఆ పార్టీ పొత్తులో భాగంగా టీడీపీ నాయకులతో చర్చలు జరుపుతున్న సంగతి తెలిసిందే.

  •  
  •  
  •  
  •  

Comments