ఇక లాండ్రీ కష్టాలకు స్వస్తి: 2019లో రానున్న రోబో..!

Saturday, January 12th, 2019, 11:10:51 AM IST

ప్రస్తుత ఉరుకుల పరుగుల జీవితంలో సగటు మనిషికి “టైమ్ మానేజ్ మెంట్” అన్నది పెద్ద సమస్యగా మారింది, పెరుగుతున్న టెక్నాలజీని ఉపయోగించుకుంటూ సమయాన్ని ఎంత సద్వినియోగం చేసుకున్నప్పటికీ ఇంకా కొత్త కొత్త ఆవిష్కరణల అవసరం పడుతూనే ఉంది. గతంలో మనుషులు ఎక్కువ సమయం, శ్రమ కేటాయించి చేసే పనులు ఇప్పుడు మనుషుల అవసరం లేకుండానే జరిగిపోయే పరిస్థితి వచ్చింది. అప్పట్లో గంటల సమయం వెచ్చించి చేసే పనులు ఇప్పుడు క్షణాల్లో పూర్తయ్యే పరిస్థితి వచ్చింది. దీనంతటికి కారణం రోబోటిక్స్ రంగంలో విప్లవమే అని చెప్పాలి, ఈ రంగంలో వచ్చిన పెను విప్లవం మనిషి జీవితంలో ఊహించని మార్పులని తేవటమే కాకుండా, మానవ జీవన ప్రమాణాలు పెంచేందుకు తోడ్పడింది. తాజాగా రాబోతున్న మరో రోబో, లాండ్రీ విషయంలో మన కష్టాలకు స్వస్తి పలకనుంది.

“సీఈఎస్” అనే ట్రేడ్ షోలో ప్రదర్శింపబడ్డ ఒక రోబో మాతృక అందరి దృష్టిని ఆకర్షించింది, క్షణాల్లో బట్టలను మడత వేయటం దీని ప్రత్యేకత. అయిదు నిమిషాల్లో 25వరకు బట్టలను మడత వేయగలడు ఈ రోబో, మనిషి కన్నా చక్కగా బట్టలు మడత వేస్తూ అందరిని ఆశ్చర్య పరుస్తుంది ఈ రోబో. 2019లోనే ఈ రోబో లాంచ్ అవబోతోందని ప్రకటించారు, ఈ ప్రకటనతో ఇక లాండ్రీ కష్టాలు తీరబోతున్నాయి అని ఆనందం వ్యక్తం చేశారు సందర్శకులు. ఈ రోబో వల్ల ముఖ్యంగా నగరవాసులకు, ఇంటి నుండి దూరంగా ఉండి వర్క్ చేసేవారికి, లాండ్రీ కష్టాల నుండి ఉపశమనం లభించబోతోంది.