శ్రీరెడ్డికి ఛాలెంజ్ తో షాకిచ్చిన లారెన్స్!

Monday, July 30th, 2018, 04:48:25 PM IST

టాలీవుడ్ లో కొన్నాళ్ల క్రితం కాస్టింగ్ కౌచ్ విషయమై కొందరు తనను, అలానే తెలుగు అమ్మాయిలను లైంగిక వేధింపుల పేరుతో హింసిస్తున్నారని పెను సంచలనం రేపిన వర్ధమాన నటి శ్రీరెడ్డి. ఆ తరువాత సినీ నిర్మాత సురేష్ బాబు తనయుడు అభిరామ్, ఇక దర్శకుడు కొరటాల శివ, రచయిత కోన వెంకట్, హీరో సందీప్ కిషన్, హీరో నాని, ఇక ప్రస్తుతం డాన్స్ మాస్టర్, మరియు తమిళ దర్శకుడు సుందర్ సి. ఇలా చెప్పుకుంటూ పోతే శ్రీరెడ్డి చేస్తున్న ఆరోపణల లిస్ట్ పెరిగిపోతోంది. వీటిలో ఏ ఘటనలు ఎంతవరకు నిజమో తెలియదుకాని ఆమె ఆరోపణలు చేసిన వారిలో స్పందించిన కొందరు మాత్రం గట్టిగానే సమాధానమిచ్చారు. ఇక ఆమె తనపై చేసిన ఆరోపణలకు నేడు గట్టిగా సమాధానమిచ్చారు డాన్స్ మాస్టర్ లారెన్స్. అయన తన సోషల్ మీడియా మాధ్యమం ఫేస్ బుక్ ద్వారా సమాధానమిస్తూ ఆమెకు ఒక ఛాలెంజ్ విసిరారు.

అయన తాను చేసిన పోస్ట్ లో పేర్కొంటూ, హాయ్ ఫ్రెండ్స్ నేను ట్రస్ట్ ని స్థాపించి 13ఏళ్ళు అవుతోంది, అప్పటినుండి తనవంతుగా దివ్యంగులకు తనవంతుగా సేవలందిస్తున్నాను. అయితే ఇటీవల టాలీవుడ్ నటి శ్రీరెడ్డి తనపై చేసిన ఆరోపణలు బాధించాయని, అందువల్ల తాను ఆమెకు ఒక సవాలు విసురుతున్నట్లు తెలిపారు. విషయం ఏమిటంటే, మీరు నన్ను రెబల్ సినిమా సమయంలో కలిశారు. ఆ సినిమా విడుదలయి ఏడేళ్లు గడిచింది. మరి నేను మిమ్మల్ని అప్పట్లో హోటల్ రూమ్ కి పిలిపించి అవకాశం పేరుతో అసభ్యంగా ప్రవర్తించాను అని అప్పుడే చెప్పి వుండొచ్చుకదా అని అన్నారు. అయితే ప్రస్తుతం తాను అడుగుతున్నది ఏమిటంటే, మీరు, మీ మంచి కోరుకునే వారు, మరియు మీ లాయర్లు, మరియు అనునాయులను వెంటపెట్టుకుని తీసుకురండి. అందరం కలిసి ఒక స్టేజి మీద కూర్చుని మీడియా, మరియు ప్రజల ముందు కూర్చుందాం. నేను మీకు కొన్ని డాన్స్ మూమెంట్స్ మరియు కొన్ని సీన్స్ ఇస్తాను,

వాటిని మీరు అందరి ముందు నటించి చూపించండి. అయితే నేనిచ్చేవి కష్టమైన డాన్స్ మూమెంట్స్, మరియు సీన్స్ కాదు. అందరూ చేయగలిగిన నార్మల్ వె ఇస్తాను అన్నారు.
ఒకవేళ మీరు కనుక బాగా చేసినట్లు నిరూపిస్తే మీకు నా తదుపరి చిత్రంలో మంచి పాత్ర ఒకటి ఇస్తాను. అందులో మీరు మిమ్మల్ని ప్రూవ్ చేసుకోండి. తప్పకుండా మీకు మంచి అవకాశాలు భవిష్యత్తులో వస్తాయి అని అన్నారు. అయితే తాను మాత్రం శ్రీరెడ్డి ఆరోపణలపై ఎటువంటి ఫిర్యాదులు చేయనని, ఎందకంటే తన తల్లి పేరుమీద గుడి కట్టి మహిళలందరిని దానికి ధర్మకర్తలుగా చేసిన తనకు వారంటే అపార గౌరవం మరియు అభిమానమని చెప్పారు. మరి లారెన్స్ విసిరిన ఈ సవాలుకు శ్రీరెడ్డి ఎలా స్పందిస్తుందో చూడాలి…..

  •  
  •  
  •  
  •  

Comments