లేడీస్‌పై రావెల కుమారుల అఘాయిత్యాలు తెలియ‌నివా?

Sunday, February 12th, 2017, 09:32:47 AM IST


మ‌హిళా సైన్స్ కాంగ్రెస్ వేళ తెలుగు దేశం నేత‌ల‌పై వైసీసీ నేత‌ల ఎటాక్ మొద‌లైంది. వీళ్లా ఆడాళ్ల‌ను ఉద్ధ‌రించేది? కాల్‌మ‌నీ సెక్స్ రాకెట్ న‌డిపించిన తేదేపా నేత‌లు, మ‌హిళ‌ల‌పై అఘాయిత్యాలు చేసిన వీళ్లు చ‌ట్ట స‌భ‌ల్లో మహిళా సాధికార‌త గురించి మాట్లాడ‌డం హాస్యాస్ప‌దంగా ఉందంటూ వైకాపా మ‌హిళా నేత గంగా భ‌వాని ఓ టీవీచానెల్ లైవ్ సాక్షిగా విమ‌ర్శించారు. అంతేకాదు.. ఇదే సంద‌ర్భంలో మంత్రి రావెల కుమారుల భోగోతాన్ని గంగా భ‌వాని మ‌రోసారి తిర‌గ‌తోడారు. హైద‌రాబాద్‌లో ఒంట‌రిగా వెళుతున్న మ‌హిళ చెయ్యి ప‌ట్టుకున్న రావెల కొడుకు గురించి తెలియ‌నిదా? రావెల కుమారుల అఘాయిత్యాలు ఎంద‌రికి తెలీవు? అంటూ ప్ర‌శ్నించారు గంగా భ‌వాని.

నిన్న‌టిరోజున స్పీక‌ర్ కోడెల కోడ‌లు త‌న‌ని హ‌రాస్ చేశారంటూ ఓ వీడియోతో లైవ్‌లోకొచ్చి టీడీపీ ప‌రువు బ‌జారుకీడ్చారు. ఇప్పుడు మంత్రి ప‌దవులు వెల‌గ‌బెడుతున్న టీడీపీ నేత‌లు అంటూ గంగా భ‌వాని ఏకేస్తున్నారు. అన్ని అఘాయిత్యాలు చేసినా రావెలపై క‌నీసం పోలీసు కేసులైనా లేవే.. అంటూ గంగా భ‌వానీ ప్ర‌శ్నించారు. మ‌రి ఈ ప్ర‌శ్న‌ల‌కు అట్నుంచి స‌మాధానం ఉందంటారా?