ఆత్మగౌరవాన్ని హస్తిన లో తాకట్టు పెట్టిన నేతలు…

Friday, November 2nd, 2018, 01:33:56 PM IST

తెలుగు వారి ఆత్మగౌరవాన్ని దెబ్బతీస్తుంది కాంగ్రెస్ అని, ఆలా జరగనివ్వకుండా ఉండేందుకే ఆనాడు ఎన్టీఆర్ గారు టీడీపీ ని స్థాపించారు. అలాంటి పార్టీని, తెలుగువారి ఆత్మగౌరవాన్ని ఇప్పుడు చంద్రబాబు ఢిల్లీలో కాంగ్రెస్ కి తాకట్టు పెట్టారని ఎంపీ వినోద్ కుమార్ విమర్శించారు. టీడీపీ వాళ్ళ యొక్క మౌలిక సిద్ధాంతాలకు విరుద్ధంగా చంద్రబాబు కాంగ్రెస్ తో అప్రవిత పొత్తుపెట్టుకున్నారని ఎద్దేవా చేసారు. తెలంగాణాలో తెరాస ప్రభుత్వాన్ని లేకుండా చేసి, కెసిఆర్ ని దెబ్బతీసి తెలంగాణ ప్రజలపై కక్ష సాధించేందుకే వారిరువురు ఒక్కటయ్యారని, అనవసరంగా చంద్రబాబు కాంగ్రెస్ తో నీతిమాలిన పొత్తులకు తెరా తీసి సరికొత్త కుట్రలను లేవనెత్తుతున్నారని ఆరోపించాడు. ఏపీ ప్రజల మెప్పు పొందడానికి చంద్రబాబు, రాహుల్ ప్రత్యేక హోదా పేరుతొ నాటకాలు ఆడుతున్నారని విమర్శించాడు.

బాబు తో చేతులు కలిపినా రాహుల్ ఏపీ కి పన్ను రాయితీలతో కలిపిన ప్రత్యేక హోదా ఇస్తారో లేక పన్ను రాయితీలులేని ప్రత్యేకహోదా ఇస్తారో ప్రజలకు స్పష్టత ఇవ్వాలని ఎంపీ వినోద్ కుమార్ డిమాండ్ చేసారు. గతం లో ఏపీ కి హోదా ఇవ్వొద్దని, ఇస్తే తమ రాష్ట్రాల్లోని పరిశ్రమలు ఏపీ కి తరలిపోతాయని అప్పటి తమిళనాడు కర్ణాటక సీఎం లు జయలలిత, సిద్ద రామయ్య లుకేంద్రానికి లేఖ రాసారని గుర్తు చేసారు. పన్ను రాయితీలతో కూడిన ప్రత్యేక హోదా ఇచ్చి పరిశ్రమలకి దెబ్బతీస్తామంటే మాత్రం ఒప్పుకొబ్బియేది లేదని తెలిపారు. తెలంగాణా ప్రజలు కూటమిని తిప్పికొట్టబోతున్నారని, ఎన్నికల తరువాత కాంగ్రెస్ కనుమరుగవుతుంది ప్రకటన లో తెలిపారు.

  •  
  •  
  •  
  •  

Comments