ఎల్ఈడీ సినిమా థియేటర్ మొదలైపోయింది!

Monday, September 3rd, 2018, 09:55:37 AM IST

కాలం పరిగెడుతున్న కొద్దీ టెక్నాలిజీలో మార్పులు చాలా వస్తున్నాయి. ఎప్పటికప్పుడు అప్గ్రేడ్ అవుతూ భవిష్యత్తుపై అంచనాలను పెంచుతున్నారు. ఇప్పటివరకు టెలివిజన్ రంగంలోనే ఎల్ఈడి టెక్నాలిజీను చూశాం. అయితే మరికొన్నేళ్లలో మొత్తం సినిమా థియేటర్స్ లలో కూడా ఎల్ఈడీ అనుభూతుని పొందబోతున్నట్లు చెప్పవచ్చు. ఎందుకంటే ఢిల్లీలో మొదటి ఎల్ఈడీ ధియేటర్ వచ్చేసింది. అసలైన హెచ్డి క్లారిటీ ఎల్ఈడీ స్క్రీన్లలో అద్భుతంగా ఆస్వాదించవచ్చు.

అయితే ఇది బారి వ్యయంతో కూడుకున్నది. ఇండియాలో తొలి ఎల్ఈడీ థియేటర్ పివిఆర్ సంస్థ స్టార్ట్ చేసింది. శాంసంగ్‌ సంస్థ సహకారంతో ఢిల్లీలోని పీవీఆర్‌ మల్టీప్లెక్స్‌ లో ఈ స్క్రీన్ ఏర్పాటైంది. ఇకపోతే నిర్వాహకులు సౌండ్ క్లారిటీ కూడా అద్భుతంగా ఉంటుందని చెబుతున్నారు. దీనికి ఎల్ఈడీ ప్రొజెక్టర్ అవసరం లేదు. సాధారణంగా ఎల్‌ఈడీ తెరకు ప్రొజెక్టర్‌ ఆవసరమైనప్పుడు లైట్స్ ఆఫ్ చేస్తారు. అయితే ఎల్ఈడీ థియేటర్ లో లైట్లు ఉన్నా కూడా చూడవచ్చట. ఇప్పటివరకు వరల్డ్ లో 12 థియేటర్లలో ఇలాంటి స్క్రీన్లను ఏర్పాటు చేశారు. 7 కోట్ల రూపాయలతో ఈ ఎల్ఈడి థియేటర్ ను నిర్మించినట్లు పీవీఆర్‌ మల్లీప్లెక్స్‌ జాయింట్‌ మేనేజింగ్‌ డైరెక్టర్‌ సంజీవ్‌ కుమార్‌ బిజ్లి తెలిపారు.

  •  
  •  
  •  
  •  

Comments