సీపీఐ 13, సీపీఎం 13.. ఇదే లెక్క !

Thursday, March 14th, 2019, 01:56:32 PM IST

జనసేన పొత్తుతో నూతనోత్సాహం నింపుకున్న కమ్యూనిస్టు పార్టీలు ఆలస్యం లేకుండా సీట్ల పంపకాన్ని తేల్చుకోవాలనుకుంటున్నాయి. ముందుగా రాష్ట్రంలోని నియోజకవర్గాల్లో తమ బలాబలాలను బేరీజు వేసుకున్న సీపీఎం, సీపీఐ నేతలు మొత్తం 26 స్థానాల్లో పోటీకి దిగాలని నిర్ణయించుకున్నారు. వాటిలో 13 స్థానంలో సీపీఐ, 13 స్థానాల్లో సీపీఎం పోటీకి దిగాలనుకుంటున్నట్టు సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ అన్నారు.

ఈ నెల 16న విజయవాడలో రాష్ట్రకార్యవర్గ సమావేశం నిర్వహించి అనంతరం పవన్ కళ్యాణ్ తో సమగ్ర సమావేశంలో కూర్చోనున్నారు. ఈ సమావేశంలోనే పవన్ తన తుది నిర్ణయాన్ని వ్యక్తం చేయనున్నాడు. ఇప్పటికే జనసేన తరపున 32 అసెంబ్లీ, 4 పార్లమెంట్ స్థానాల్ని ప్రకటించిన పవన్ వామపక్షాలు అడిగినన్ని సీట్లు ఇవ్వడానికి సుముఖత చూపే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని రాజకీయవర్గాలు చెబుతున్నాయి. ఒకవేళ నిజంగానే పవన్ 26 సీట్లను కేటాయించి, ఆయా స్థానాల్లో ప్రచారానికి ఒప్పుకుంటే గనుక కమ్యూనిస్టుల పంట పండినట్టే.