పవన్ మెడలో ఉండే ఎర్ర తుండు ఆయన చేతిలో జెండాగా మారుతుందా ?

Sunday, September 18th, 2016, 02:34:17 PM IST

pawan-jana
2014 రాష్ట్ర ఎన్నికల్లో పెను సంచలనం పవన్ కళ్యాణ్. టీడీపీ-బీజేపీ కూటమికి అధికారం రావడంలో ఆయన పాత్ర కూడా ప్రధానమైనదే. కానీ ప్రస్తుతం కేంద్ర బీజేపీకి, రాష్టర్ టీడీపీకి పవన్ అంటే పొసగడం లేదు. ఎందుకంటే ప్రత్యేక హోదాపై ఆయన చేస్తున్న పోరాటమే అందుకు కారణం. దీంతో ప్రస్తుతం ఆయన ఒంటరిగానే ఉన్నారు. అలాగే కాకుండా సభలో పవన్ కమ్యూనిస్టుల పోరాటాలంటే నాకిష్టం అంటూ కమ్యూనిస్టు లపై తన సాఫ్ట్ కార్నర్ ని ప్రదర్శించాడు.

పార్టీలోని ఉద్దండులు, సీనియర్ నేతలు కాలం చేశాక తమని అవకాశవాద రాజకీయాలకు ఉపయోగించుకున్న నాయకులే తప్ప పవన్ లా నిజాయితీగా తమ గత చరిత్రను అభినందించిన నాయకులు లేకపోవడంతో ఆలోచనలో పడ్డ ఉభయ లెఫ్ట్ పార్టీలు ఏ తోడూ లేని తమపై పవన్ ఆసక్తిని, దాదాపుగా తమ సిద్ధాంతాలకు దగ్గర ఉన్న జనసేన సిద్ధాంతాలకు బేరీజు వేసుకుని పవన్ తో కలిసి పని చేస్తే తమ పార్టీకి కూడా ప్రజాకర్షణ నేత దొరికినట్టు ఉంటుందని భావించి పవన్ వ్యాఖ్యలను తాము స్వాగతిస్తున్నామని, ఆయన తమతో కలిసి పని చేయవచ్చని ప్రకటించేశాయి. ఇక పవన్ కూడా పూర్తి స్థాయి సంస్థాగత నిర్మాణం లేని తన పార్టీకి తోడుగా కదలికలేని బలమైన కమ్యూనిస్టు మూలాల్ని ఉపయోగించుకునే ఆలోచన చేస్తే రాబోయే రోజుల్లో రాష్ట్ర లెఫ్ట్ పార్టీలను అన్నీ తానై నడిపే అవకాశముంది. ఇక ఈ విషయంపై పవన్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో చూడాలి.