లెజెండ్ విజయోత్సవంలో అపశృతి

Sunday, December 28th, 2014, 06:24:48 PM IST

legend-successful-meet
బాలకృష్ణ నటించిన లెజండ్ సినిమా విజయోత్సవ కార్యక్రమం ప్రొద్దుటూరులో జరుగుతున్న విషయం తెలిసిందే. ఈ విజయోత్సవ కార్యక్రమంలో పాల్గొనేందుకు బాలకృష్ణ ప్రొద్దుటూరు బయలుదేరివెళ్లారు . కాగ, ఈ కార్యక్రమంలో అపశృతి చోటుచేసుకున్నది. పోలీస్ ఎస్కార్ట్ వాహనం ప్రొద్దుటూరులో అభిమానులను డీకొన్నది. దీంతో ఒకరు మరణించగా, మరో ఇద్దరికీ తీవ్రంగా గాయాలు అయినట్టు తెలుస్తున్నది. బాలకృష్ణ నటించిన లెజెండ్ సినిమా ప్రొద్దుటూరులో విజయవంతంగా ప్రదర్శించబడుతున్నది. కాగ, ఈ విజయోత్సవ కార్యక్రమానికి బాలకృష్ణ వస్తున్నారనే వార్తలు వెలువడటంతో ఆయన చూసేందుకు అభిమానులు భారీ ఎత్తున తరలివచ్చారు.