జనసేన ని అధికారం లోకి తీసుకువద్దాం… పవన్

Thursday, November 15th, 2018, 09:19:16 PM IST

మనమందరం బతుకుతున్నది కుళ్లిపోయిన సమాజం లో, ఎక్కడ చుసిన అవినీతి, ఎంతో మంది గొప్ప నాయకులు ఉన్న మన సమాజం కొందరి పాలన వలన ఇలా నీచంగా తయారవుతుంది. ఎన్నో నీచ రాజకీయాలు, కుళ్లిపోయిన వ్యవస్థ ఇంకా పెరుగుతూ పోతూ ఉంది. ఇలాంటి అవినీతిని పారద్రోలి జనసేన ప్రభుత్వాన్ని ఏర్పాటు చేద్దామని జనసేన అధినేత పవన్‌కల్యాణ్ రాజమండ్రి లో జరిగిన బహిరంగ సభ లో తేలిపారు. నాయకులు నిర్వహిస్తున్న ప్రజా పోరాట యాత్రలో భాగంగా రాజానగరంలో బహిరంగ సభ నిర్వహించారు. ఈ సభ లో పవన్ మాట్లాడుతూ బోఫోర్సు లాంటి కుంభకోణాలు, ప్రస్తుతం నియోజకవర్గం స్థాయిలోనే జరుగుతున్నాయని తీవ్రంగా ఆరోపించారు.

ఆ నాడు అన్నగారు తెలుగువారి ఆత్మగౌరవం కోసం ప్రారంభించిన తెలుగుదేశం పార్టీ ని, నేడు మన సీఎం చంద్రబాబు నాయుడు కాంగ్రెస్ నేతల కాళ్ల దగ్గర తాకట్టు పెట్టారని పవన్ మండిపడ్డారు. అంతకుముందు జరిగిన ఎన్నికలలో జనసేన లేకుండా చంద్రబాబు సీఎం అయ్యేవారా అని ప్రశ్నించారు. ఇక్కడున్న అవినీతి రాజకీయ నాయకులను తన్ని తరిమేద్దామని ఆయన పేర్కొన్నారు. విద్యాసంస్థలను మంత్రి నారాయణకు ఇచ్చేస్తారని, మద్యం షాపులను మాత్రం చంద్రబాబు, జగన్, లోకేష్ నడుపుతారని దుయ్యబట్టారు. బైబిల్ పట్టుకుని తిరిగే జగన్… మద్య నిషేధంపై ఎందుకు మాట్లాడరని, జగన్ కి దమ్ముంటే ప్రజా సమస్యలపై అసెంబ్లీ లో నిలదీయాలని పవన్‌కల్యాణ్‌ నిలదీశారు.