10,000కే ఐఫోన్ పీచ‌ర్ల‌తో చంపేస్తున్న చైనా ఫోన్ ఇదే!

Thursday, September 29th, 2016, 08:19:21 AM IST

letv
లీ-ఎకో ఇటీవ‌లి కాలంలో ఉవ్వెత్తున తెర‌పైకి దూసుకొచ్చిన చైనా ఫోన్ ఇది. ఇంచుమించి ఐఫోన్ ఫీచ‌ర్స్‌ని కాపీ కొట్టేసి.. కేవ‌లం రూ.10 వేల రేంజు నుంచే ఫోన్ల‌ను అమ్మేయ‌డంతో ఐఫోన్‌ల‌కు గిరాకీ ప‌డిపోయింది. ప్ర‌స్తుతం భార‌త్‌లో ఈ ఫోన్ తెగ హ‌ల్‌చ‌ల్ చేస్తోంద‌న్న‌ది టెక్కీల మాట‌.

లీ -ఎకో నుంచి ఇటీవ‌లే లీ ప్రొ- 3 లాంచ్ అయ్యింది. లేటెస్టుగా ఇది.. వినియోగ‌దారుల‌కు అందుబాటులోకొచ్చింది. 4/6 జీబీ ర్యామ్‌, 32/ 64 జీబీ ఇంట‌ర్న‌ల్ స్టోరేజ్ దీని ప్ర‌త్యేక‌త‌. ఈ ఫోన్ వ‌రుస‌గా రూ. 18,070, రూ. 20,080 ధ‌ర‌ల‌కు వినియోగ‌దారుల‌కు అందుబాటులోకి రావ‌డంతో 30-40 వేల రేంజులోని ఐఫోన్‌కి పంచ్ ప‌డింది. లీఎకో 1ఎస్‌, లీ ఎకో 2ఎస్ వంటి ఫోన్లు ఇంచుమించు ఇదే ఫీచ‌ర్ల‌తో కేవ‌లం 10 వేల నుంచి 12 వేల రేంజులో దొరికేస్తుంటే ఆన్‌లైన్ ఠారెత్తిపోతోంద‌ని చెబుతున్నారు.

లీఎకో లీ ప్రొ- 3 ఫీచ‌ర్స్‌:
*5.5 ఇంచ్ పుల్ హెచ్‌డీ 2.5 డి క‌ర్వాడ్ గ్లాస్ డిస్‌ప్లే. 1920x 1080 పిక్స‌ల్స్ స్క్రీన్ రిజ‌ల్యూష‌న్‌
*2.34 గిగా హెడ్జ్ క్వాడ్ కోర్ స్నాల్ డ్రాగ‌న్ 821 ప్రాసెస‌ర్‌, అడ్రినో 530 గ్రాఫిక్స్‌
*4/6 జీబీ ర్యామ్‌, 32/ 64 జీబీ ఇంట‌ర్న‌ల్ స్టోరేజ్‌
*ఆండ్రాయిడ్ 6.0 మార్ట్ మాలో, డ్యుయ‌ల్ సిమ్‌
*16 మెగా పిక్స‌ల్ రియ‌ర్ కెమెరా విత్ డ్యుయ‌ల్ టోన్ ఎల్ఈడీ ఫ్లాస్‌
*8 మెగా పిక్స‌ల్ సెల్పీ కెమెరా
*ఫింగ‌ర్ ప్రింట్ సెన్సార్‌, ఇన్ ఫ్రారెడ్ సెన్సార్‌
*డాల్బీ ఆట్మోస్‌, 4జీ వీవోఎల్ టీఈ వైఫై 802.1 ఏసీ
*బ్లూటూత్ 4.2 యూఎస్‌బీ టైప్‌-సి, ఎన్ ఎఫ్‌సీ
*4070 ఎంఏహెచ్ బ్యాట‌రీ, క్విక్ ఛార్జ్ 3.0