వీడియో : రోడ్డుమీద సింహాల ఫ్యామిలీ హల్ చల్!

Wednesday, July 11th, 2018, 12:32:11 PM IST

గుజరాత్ లోని అమ్రేలీ ప్రాంతంలో బాహ్య ప్రపంచానికి వచ్చి తరచు సింహాలు తీరుగుతుంటాయి. అక్కడి జనాలకు రోజు సింహాలను చూడటం అలవాటే. ఆహారం దొరకకపోతేనే సింహాలు జనావాసాల్లోకి వస్తుంటాయి. అయితే కొన్ని సార్లు రోడ్లపైకి వచ్చి సింహాలు జనాలను భయపెడుతూ ఉంటాయి. రీసెంట్ గా కొన్ని సింహాలు కూడా అడవి గుండా బస్సులో వెళుతున్న ప్రయాణికులకు ఆశ్చర్యాన్ని కలిగించాయి.

ఒక సింహాల ఫ్యామిలీ కొంత సేపు రోడ్డు మీద నడిచి అందరిని ఆకర్షించాయి. ఇక బస్సు డ్రైవర్ కొన్ని నిమిషాల వరకు బస్సును ఒకే చోట నిలిపి ఉంచి సింహాల గ్యాంగ్ అక్కడి నుంచి వెళ్లిపోయేవరకు బస్సును కదిలించలేదు. దీంతో బస్సులో ఉన్న ప్రయాణికులు సింహలను వీడియో తీసి సోషల్ మీడియాలో షేర్ చేశారు. అందుకు సంబందించిన వీడియోలు ఫొటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

  •  
  •  
  •  
  •  

Comments