జిల్లాల వారీగా ఓటర్ల జాబితా విడుదల…

Saturday, January 12th, 2019, 02:40:52 PM IST

ఆంధ్రప్రదేశ్ లో జరిగే ఎన్నికల నేపథ్యంలో, ఏపీ లోని అన్ని జిల్లాలకి సంబంధించిన చివరి ఓటర్ల జాబితాలను రాష్ట్ర ఎన్నికల కమిషన్ ప్రకటించింది. తాజాగా వెలువడిన నివేదిక ప్రకారం మొత్తం ఆంధ్రప్రదేశ్లో ఓటర్లు 3,69,33,091 ఉండగా, అందులో పురుషులు 1,83,24,588, మహిళలు 1,86,04,742.. థర్డ్ జెండర్ ఓటర్లు 3,761 మంది ఉన్నట్లు తాజాగా ఎన్నికలా సంఘం విడుదల చేసింది. అయితే జిల్లాల వారీగా చూసుకుంటే, తూర్పు గోదావరి జిల్లా అత్యదికంగా 40,13,770 ఓటర్లతో ముందుండగా, అత్యల్పంగా ఓటర్లు కలిగిన జిల్లాగా 17,33,667 విజయనగరం చివరన ఉంది.

ఓటర్లు జిల్లావారీగా :

1. శ్రీకాకుళం – 20,64,330
2. విజయనగరం – 17,33,667
3. విశాఖ – 32,80,028
4. తూ.గో. జిల్లా – 40,13,770
5. ప.గో. జిల్లా – 30,57,922
6. కృష్ణా జిల్లా – 33,03,592
7. గుంటూరు – 37,46,072
8. ప్రకాశం జిల్లా – 24,95,383
9. నెల్లూరు – 22,06,652
10. కడప – 20,56,660
11. కర్నూలు – 28,90,884
12. అనంతపురం – 30,58,909
13. చిత్తూరు – 30,25,222