ఆ ఆలయ ప్రసాదంలో బల్లి…..73మంది భక్తులకు అస్వస్థత!

Monday, April 30th, 2018, 09:33:56 PM IST


నేడు ఒక ఆలయంలో భక్తులు తిన్న ప్రసాదం విషపూరితం కావడంతో అది తిన్న పలువురు భక్తులు తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. విషయంలోకి వెళితే, తమిళనాడు లోని కడలూరు జిల్లాలోని సతమంగళం గ్రామంలో అమ్మన్ ఆలయం లో జరుగుతున్న వేడుకల్లో భాగంగా భక్తులకు ప్రసాదంగా సాంబారుతో చేసిన అన్నం పెట్టారు. అయితే ఆ ప్రసాదాన్ని తిన్న భక్తులు హఠాత్తుగా వున్నట్లుండి వాంతులు, కళ్ళు తిరగటం తో వారిని హుటాహుటిన దగ్గరలోని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.

వారికి చికిత్స అందించిన వైద్యులు వారు తిన్న ప్రసాదంలో ఏదో దోషం వుందని, అందువల్లనే ఇలా జరిగిదని చెప్పారు. అయితే ప్రసాదాన్ని పూర్తిగా పరిశీలించగా అందులో చనిపోయిన బల్లి కనపడింది. అయితే ఈ విషయమై వివరాలు తెలుసుకున్న పోలీస్ లు కేసు నమోదు చేసి, జరిగిన తప్పు అసలు ఎలా జరిగింది అనే దానిపై విచారణ చేపట్టారు. భక్తులకు మెరుగైన వైద్యసేవలు అందిస్తున్నామని ఆలయ అధికారి చెప్పారు…..

  •  
  •  
  •  
  •  

Comments