ఎబీఎన్ ఎండి రాధాకృష్ణ ప్రాజెక్టు పై స్దానికుల ఆగ్రహం

Tuesday, January 28th, 2014, 01:40:14 PM IST


విజయవాడ బుడమేరు కాలువపై ఆంధ్రజ్యోతి ఎండి వేమూరి రాధాకృష్ణకు చెందిన పవర్ ప్లాంట్ కు తాజాగా తిరిగి అనుమతులు ఇవ్వడం పై స్దానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ విషయంలో ప్రజాభిప్రాయాన్ని సేకరించాలని స్దానికులు డిమాండ్ చేస్తున్నారు. పవర్ ప్రాజెక్ట్ కు గతంలో మొదటి సారి చంద్రబాబు నాయుడు అనుమతి ఇవ్వగా అది వివాదాస్పదంగా మారటంతో, తరువాత ముఖ్య మంత్రిగా నియమితులైన వైయస్ అనుమతులను రద్దు చేశారు. బుడమేరు కాలువ కు వరదలు వచ్చిన ప్రతిసారి విజయవాడకు ముంపు సమస్య తలెత్తుతుంది. బుడమేరు ఆధునీకరణకు ఈ ప్లాంట్ అడ్డంకిగా మారింది. బుడమేరు ఆధునీకరణ చేయక పొతే విజయవాడకు ముంపు తప్పదని అప్పట్లో ఇంజనీరింగ్ నిపుణులు నివేదిక సమర్పించారు. దీంతో పవర్ ప్లాంట్ రద్దు చేయాలని వైయస్ నిర్ణయం తీసుకున్నారు. గతంలో సిఎం లు గా పనిచేసిన వైయస్, రోశయ్య లను కాదని, ప్రస్తుతం కిరణ్ కుమార్ రెడ్డి ప్రభుత్వం ఎబీఎన్ ఎండి పవర్ ప్లాంట్ కు అనుమతులు ఇవ్వడంపై అందరిలోనూ చర్చనీయాంశంగా మారింది.