పవన్ సాక్ష్యాలు చూపిస్తే మాట్లాడతా – లోకేశ్..!

Wednesday, November 21st, 2018, 08:36:47 PM IST


2014 ఎన్నికల్లో టీడీపీ, బీజేపీ లతో జత కట్టి వాటి గెలుపుకు కృషి చేసిన పవన్ తర్వాత టీడీపీ అవినీతి మాయం అయిందంటూ ఆరోపించి మద్దతు ఉపసంహరించుకున్నారు. ఆ నాటి నుండి చంద్రబాబు, లోకేష్ లపై, పలువురు టీడీపీ నాయకులపై కూడా తీవ్ర స్థాయిలో విమర్శలు చేస్తున్నారు పవన్ కళ్యాణ్. ఎన్నికలు దగ్గర పడుతున్న సమయంలో ఆ తీవ్రత ఇంకా పెంచారు, ఇటీవల బాబు, లోకేష్ లను టార్గెట్ చేస్తూ వరుసగా విమర్శలు చేస్తున్నారు. ముఖ్యంగా అగ్రి గోల్డ్ ఆస్తుల విషయంలో లోకేష్ పై సమయం దొరికినప్పుడల్లా విరుచుకు పడుతున్నారు. ఈ నేపథ్యంలో బుధవారం తన కుటుంబ ఆస్తుల విలువ ప్రకటించిన లోకేష్ మీడియాతో మాట్లాడుతూ పవన్ కళ్యాణ్ తనపై చేస్తున్న అవినీతి ఆరోపణలకు ఆధారాలు చూపించాలని అన్నారు.

అగ్రిగోల్డ్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న కాలంలో డిపాజిట్లను సేకరించిందన్నారు. ప్రస్తుతం అగ్రిగోల్డ్ వ్యవహారం కోర్టు కేసులో ఉందన్నారు. అగ్రిగోల్డ్‌కు చెందిన హయ్‌ల్యాండ్ ప్రాపర్టీ విషయమై తన మీద ఆరోపణలు చేస్తున్నారని లోకేష్ మండిపడ్డారు. ఈ భూములకు తమకు ఏం సంబంధమని ఆయన ప్రశ్నించారు. కోర్ట్ ఆదేశాల మేరకు అగ్రిగోల్డ్ ఆస్తులను విక్రయించి డిపాజిటర్లకు వారి డబ్బు చెల్లిస్తున్నట్టు చెప్పారు.