బీజేపీ – వైసిపి కుమ్మక్కయ్యాయి.. డోస్ పెంచిన లోకేష్

Wednesday, May 30th, 2018, 01:00:30 AM IST

తండ్రితో పాటు తనయుడు లోకేష్ బాబు కూడా ఈ మధ్య ప్రతి పక్షాలపై వరుసగా విమర్శలు చేయడం స్టార్ట్ చేశారు. మొన్నటి వరకు ఒక లెవెల్ లో కామెంట్స్ చేసిన చంద్రబాబు ఈ మద్యే డోస్ పెంచారు. వైసిపి బీజేపీ నేతలను ఓ ఆటాడుకుంటున్నారు. అలాగే మంత్రి లోకేష్ కూడా తండ్రికి ఏ మాత్రం తగ్గకుండా తనదైన శైలిలో కామెంట్స్ చేస్తూ వెళుతున్నాడు. రీసెంట్ గా మీడియా సమావేశంలో లోకేష్ ప్రతిపక్షాలపై చేసిన విమర్శలు హాట్ టాపిక్ గా మారాయి. అసలైన ఎన్నికల వార్ ఇప్పుడే మొదలైందని మీడియాల్లో అనేక కథనాలు వెలువడుతున్నాయి.

ఇంతకీ లోకేష్ ఏమన్నాడంటే.. ప్రస్తుతం రాష్ట్రంలో తెలుగు దేశం పార్టీపై కుట్ర జరుగుతోంది. అందుకే కార్యకర్తల్లో భయం కనిపిస్తోంది. కానీ దైర్యంగా పార్టీని కాపాడుకోవాలనే ఆలోచనలో వారు ఉన్నారు. ఆ తపన కూడా కనిపిస్తోంది. నెక్స్ట్ కూడా సీఎం గా చంద్రబాబు ఉండాల్సిన అవసరం ఈ రాష్ట్రానికి చాలా ఉందని ఉప ఎన్నికలు ఎప్పుడు వచ్చినా సిద్ధంగా ఉన్నట్లు లోకేష్ తెలిపారు. అదే విధంగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ – భారత జనతా పార్టీ రెండు కూడా కుమ్మక్కయ్యాయని మన శత్రువు బీజేపీ అని కార్యకర్తలకు తెలియజేశారు. ప్రస్తుతం టీడీపీ పై అలాగే తమ నాయకులపై అవినీతి ఆరోపణలు చేస్తున్న వారెప్పుడు వారి ఆస్థి విలువను తెలియజేయలేదని తెలియజేశారు. ఇక వచ్చే 2022 నాటికి రూ.22వేల కోట్లతో వాటర్ గ్రిడ్ ప్రాజెక్టును పూర్తిచేస్తామని తెలుపుతూ.. వచ్చే ఎన్నికల్లో తప్పకుండా మళ్లీ టిడిపి ప్రభుత్వమే అధికారంలోకి వస్తుందని అన్నారు. ప్రస్తుతం పంచాయితీ ఎన్నికలపై వస్తున్న రూమర్స్ పై స్పందిస్తూ.. ఇంకా ఇప్పుడే రావని సమయం ఉందని లోకేష్ పేర్కొన్నారు.

  •  
  •  
  •  
  •  

Comments