జగన్ ఓ కమెడియన్.. లోకేష్ బాబు సెటైర్ వేశారుగా!

Thursday, June 14th, 2018, 02:14:26 AM IST

ఎలక్షన్స్ కి సమయం దగ్గరపడుతుండటంతో నాయకులు రాజకీయ సూత్రాలను మొదలు పెట్టారు. తెలంగాణాలో అసలైన పోరు ఇంకా మొదలవ్వలేదు గాని ఆంధ్రప్రదేశ్ లో మాత్రం ఎప్పుడో మొదలైంది. జగన పాదయాత్రలో అయితే అధికార ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో కామెంట్స్ చేస్తూ జనాలను ఆకట్టుకుంటున్నారు. ఇక లోకేష్ పై కూడా పంచులు వేస్తుండడం గత కొంత కాలంగా వస్తున్నదే. అయితే నారా లోకేష్ బాబు కూడా విమర్శకులకు కౌంటర్ ఇవ్వడానికి బాగానే ప్రయత్నం చేస్తున్నాడు.

రీసెంట్ గా అనంతపురం జిల్లాలో ప్రాథమిక ఆరోగ్యకేంద్రాన్ని ప్రారంభించిన లోకేష్ జగన్ పై వ్యంగ్యాస్త్రాలు సంధించారు. లోకేశ్ మాట్లాడుతూ.. తెలుగు దేశం పార్టీ ప్రజలకు అన్ని విధాలుగా ఆదుకుంటుంది.ప్రజల కష్టాలను అర్ధం చేసుకొని మెరుగైన వైద్య సేవలను కూడా అందిస్తోంది. వైసిపి నేతలు ఎక్కువగా అభివృద్ధి కార్యక్రమాలకు అడ్డు పడుతున్నారు. వాళ్లది ఒక డ్రామా కంపెనీ. అంతా భారత జనతా పార్టీ మోడీ డైరెక్షన్ లో అమిత్ షా స్క్రిప్ట్ ఇస్తున్నాడు. అందులో జగన్ ఒక కమెడియన్.. మిగతా నటీనటులు మొత్తం వైసిపి ఎంపిలని లోకేష్ సెటైర్ వేశారు.

  •  
  •  
  •  
  •  

Comments